"ఎగసిపడే సముద్రపు అలల్లో, మీరు కొలవలేనంత ప్రేమని పరిచయం చేయడానికి వస్తున్నాం" అని అంటున్నారు 'మహాసముద్రం' టీమ్. శర్వానంద్, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.
'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ అజయ్‌భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అదితిరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ స్వరాలు అందిస్తున్నారు.