టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి... తన టాలెంట్‌తో ఔరా అనిపిస్తోంది. జనవరి 11న సుకుమార్ 50వ పుట్టినరోజు జరిగింది. ఈ సందర్భంగా ఆ చిన్నారి తన తండ్రి కోసం ఓ పాట పాడి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. అయితే నేడు సుకృతి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. ట్విటర్ వేదికగా ఆ పాటకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. ఇది విన్న నెటిజన్లు వావ్ అంటున్నారు.

"డార్లింగ్ డైరెక్టర్ సుకుమార్ ముద్దుల కుమార్తె సుకృతికి పుట్టినరోజు శుభాంకాంక్షలు. తండ్రి పుట్టినరోజు కోసం తాను పాడిన పాటను.. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్నా. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను"
-- దేవిశ్రీ ప్రసాద్, సంగీత దర్శకుడు
సుకృతి టాలెంట్ చూసి నెటిజన్లు అబ్బురపడుతున్నారు. సుకృతిలో మంచి ప్రతిభ ఉందని పేర్కొన్నారు. 'నైస్ వాయిస్', 'అమేజింగ్ వాయిస్', 'సో బ్యూటీఫుల్', 'చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ' అని కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">