ETV Bharat / sitara

నటుడు సూర్యకు హైకోర్టు షాక్.. పన్ను కట్టాలని ఆదేశం - మద్రాస్ హైకోర్టు

తమిళ నటుడు సూర్యకు మద్రాస్​ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ విధించిన రూ 3.11 కోట్ల పన్ను చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది.

suriya, actor suriya
సూర్య, నటుడు సూర్య
author img

By

Published : Aug 18, 2021, 5:12 PM IST

తమిళ స్టార్​ హీరో సూర్యకు మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది. రూ. 3.11 కోట్లు చెల్లించాలంటూ ఆదాయపు పన్ను శాఖ ఆదేశించడాన్ని సవాల్​ చేస్తూ సూర్య వేసిన పిటిషన్​ను తోసిపుచ్చింది.

2010లో సూర్యకు సంబంధించిన ఆస్తిపై సోదాలు నిర్వహించింది ఆదాయపు పన్ను శాఖ. అనంతరం.. 2007-08, 2008-09 ఏడాదిలో లెక్కల్లో లేని పలు ఆదాయాలకు సంబంధించి రూ. 3.11 కోట్ల పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. 2018లో దీన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్​ దాఖలు చేశాడు నటుడు సూర్య. ఈ పిటిషన్​పై విచారణ జరిపిన మద్రాస్​ హైకోర్టు.. సెలబ్రిటీలు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని చెప్పింది. ఐటీ శాఖ జారీ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది.

2011లో ఆదాయపు పన్ను శాఖ ఆదేశాలు జారీ చేయగా.. ఆరేళ్ల తర్వాత సూర్య.. ఆ మొత్తంపై వడ్డీ మినహాయించాలంటూ కోర్టును ఆశ్రయించాడు. అయితే.. సెక్షన్ 220(2ఏ) ప్రకారం.. ఆదాయానికి తగ్గట్లు పన్ను చెల్లించని నేపథ్యంలో పన్నుపై వడ్డీ కూడా వసూలు చేసే అధికారం తమకు ఉందని ఐటీ డిపార్ట్​మెంట్ కోర్టుకు వివరించింది.

ఇదీ చదవండి:ఓటీటీ స్టార్​గా సూర్య.. ప్రైమ్​లో 'జై భీమ్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.