'టీవీఎఫ్ ట్రిప్లింగ్', 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్' వంటి వెబ్ సిరీస్‌లతో పాపులర్ అయిన బాలీవుడ్ నటి మాన్వీ గాగ్రూ.. మీటూ అనుభవాలు తనకూ ఎదురయ్యాయని చెప్పింది. తన ఆవేదనను వెల్లడించింది. ఓ వెబ్ సిరీస్‌లోని పాత్ర కోసం, ఓ వ్యక్తి తనను కాంప్రమైజ్ కావాలన్నాడని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.
"గతేడాది ఓ వెబ్ సిరీస్‌లో నటించాలంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. రెమ్యునరేషన్ విషయం తక్కువైందని నేను చెప్పగా, ఒకేసారి దానిని మూడురెట్లు పెంచాడు. బదులుగా నన్ను తనతో కాంప్రమైజ్ కావాలని చెప్పాడు. నాకు కోపమొచ్చి, చెడమడా తిట్టేశాను. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పి, ఫోన్ పెట్టేశాను. ఇప్పటికీ ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయంటే నమ్మలేకపోతున్నా"
-మాన్వీ గాగ్రూ, బాలీవుడ్ నటి
'ధూమ్ మచావో ధూమ్' టీవీ షోతో పరిచయమైన మాన్వీ.. అనంతరం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్', 'ఉడ్జా చమన్' సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. త్వరలో 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీస్' వెబ్ సిరీస్ సెకండ్ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి : అల్లు అర్జున్‌పై కేరళ ముఖ్యమంత్రి ప్రశంసలు