22 ఏళ్లుగా ‘మా’లో ఎన్నో పదవుల్లో సేవ చేశాను. కానీ అధ్యక్షపదవి మీద వ్యామోహం ఉన్న నరేష్ వర్గం నా పరువు బజారుకి ఈడ్చేందుకు ప్రయత్నిస్తుండటం బాధ కలిగిస్తోందంటూ మాట్లాడాడు శివాజీ.
ప్రమాణ స్వీకారం ఏప్రిల్లో చేసుకోవాలని సూచించాను. గతంలో నేను కూడా పదవి చేపట్టడానికి 25 రోజులు ఆగాను. అంతేగాని వారి ప్రమాణసీక్వారంపై నేనుకోర్టుకు వెళ్తానని చెప్పలేదు. నా ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో మా చాలా బాగుండేది కాని నాలుగేళ్లుగా 'మా'కుటుంబంలో రాజకీయాలు ప్రవేశించాయి.
-'మా' మాజీ అధ్యక్షుడు, శివాజీ రాజా
ఓ కార్యక్రమ నిర్వహణలోఆర్థికఅవకతవకలు జరిగినట్టు ఆరోపణలు చేయటం సరికాదు. ఆ వేడుకపై చిరంజీవి అధ్యక్షతన కమిటీ క్లీన్‌చిట్ సైతం ఇచ్చిందని గుర్తుచేశారు శివాజీరాజా. ఇన్నేళ్లలో నరేష్ 'మా' కు ఒక్క పైసా ఇవ్వలేదు. ప్రతీసారి విజయనిర్మల 15 వేలు ఇస్తున్నారని మాట్లాడుతున్నారు. ఆ డబ్బుతోనే మా నడుస్తుందా అంటూ ప్రశ్నించారు.
అదే కారణం...
పలు పార్టీలు మారిన జీవితా రాజశేఖర్లు నాపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అంటూ ఎద్దేవా చేశారు. నటిశ్రీరెడ్డి, మాదకద్రవ్యాల వివాదాల్లో నేను సరిగ్గా స్పందించలేదని జీవిత ప్రశ్నించారు. కానీ శ్రీరెడ్డి విషయంలో కార్డు ఇవ్వమని కొందరు, ఇవ్వొద్దని కొందరు అన్నారు. అందుకే ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయానన్నారు శివాజీరాజా.
ఆ డబ్బు ఎప్పుడొస్తుంది...
'మా' డైరీ ప్రింటింగ్ కోసం నరేష్ 14 లక్షల నిధులు సేకరించారు. కానీ అకౌంట్‌లో 7 లక్షలు మాత్రమే జమచేశారు. మిగతా డబ్బు ఏమైందని ప్రశ్నించారు శివాజీరాజా. వాటిని జమ చేసి ప్రమాణం చేస్తే బాగుంటుందని సూచించారు.
రిటర్న్ గిఫ్ట్ ఇస్తా...
ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నరేష్ వర్గానికి నాగబాబు మద్దుతు తెలిపారు. ఆయన నాకు చాలా మంచి మిత్రుడు. అందుకేనేమో నాగబాబు నాకు గిఫ్ట్ ఇచ్చారు. త్వరలోనే నేనూ రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు శివాజీరాజా.