తెలుగు సినీ నటుల సంఘం(MAA) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అక్టోబరు 10వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని గతంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. కాగా, తాజాగా 'మా' ఎన్నికలకు సంబంధించిన తేదీ(maa elections 2021 date), నియమ నిబంధనలు, ఇతర విషయాలను అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 10న(maa elections results) ఆదివారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు. ఎనిమిది మంది ఆఫీస్ బేరర్స్ 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌తో కూడిన కమిటీకి ఈ ఎన్నికలు జరగనున్నాయి.
సెప్టెంబరు 27-29 తేదీల మధ్య నామినేషన్లు స్వీకరించి 30న వాటిని పరిశీలిస్తామని కృష్ణమోహన్ వివరించారు. అక్టోబరు 2వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా ఉపసంహరణకు అవకాశం ఉంటుందని, ఆ తర్వాత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఒక అభ్యర్థి ఒకే పదవికి మాత్రమే పోటీ చేయాలని, గత కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయి ఉండి, 50 శాతం కన్నా తక్కువ ఈసీ మీటింగ్‌లకు హాజరు కాకపోయి ఉంటే పోటీ చేసేందుకు అర్హత ఉండదని తెలిపారు. 20 శాఖల అసోసియేషన్‌లలో ఆఫీస్ బేరర్స్‌గా ఉన్న వారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే 'మా' ఎన్నికల్లో(maa elections 2021) పోటీ చేయడానికి అర్హులు కారని తెలిపారు.
'మా’'ఎన్నికల్లో(maa elections 2021 date) అధ్యక్షుడి కోసం ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నర్సింహరావు పోటీపడుతున్నారు. ప్రకాశ్‌రాజ్ ఇప్పటికే తన ప్యానెల్ సభ్యులను ప్రకటించారు. ప్రస్తుతం మంచు విష్ణు ప్యానెల్‌కు సంబంధించి బాబూమోహన్, రఘుబాబు పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే పూర్తి ప్యానెల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.