'మా' ఎన్నికల్లో(maa elections 2021) విలక్షణ తీర్పులు వెలువడ్డాయి. యాంకర్ అనసూయ ఓటింగ్ రోజు గెలిచినట్లు ప్రకటించి.. తెల్లారి ఓడినట్లు చెప్పారు. అలాగే అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణు ప్యానెల్‌లో కీలక భూమిక పోషించిన నటుడు పృథ్వీరాజ్ అనూహ్యంగా ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్‌గా కూడా చెత్త రికార్డు నెలకొల్పారు.
అమ్మనా బత్తాయి, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా ప్రేక్షకులకు దగ్గరైన పృథ్వీ.. 'మా' సభ్యులను మాత్రం ఆకట్టుకోలేకపోయారు. మా ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేసేందుకు పృథ్వీరాజ్.. తెలంగాణ మూవీ అసోసియేషన్‌కు కూడా రాజీనామా చేశారు. కానీ 'మా' ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా మాత్రం గట్టెక్కలేదు. 'మా' కోసం తెలంగాణ మూవీ అసోసియేషన్ పదవి వదలుకున్న పృథ్వీరాజ్ ఓడిపోవడాన్ని సామాజిక మాధ్యమాల్లో వినూత్నంగా ట్రోల్ చేస్తున్నారు. 'అమ్మనా బత్తాయి పగిలింది'.. 'బత్తాయి ఓడింది' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
'మా' ఉపాధ్యక్షుడిగా నెగ్గేందుకు పృథ్వీరాజ్ ఓటర్లను బెదిరించారంటూ ఓ ఆడియో కూడా లీక్ అయ్యింది. అసలే పృథ్వీరాజ్ ఫోన్ కాల్ లీక్ అయితే.. సోషల్ మీడియాలో ఫుల్ సేల్ ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ఉంటూ ఓ ఆడియో కాల్ లీక్ కావటం వల్ల పదవి పోగొట్టుకున్నారు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా ప్రేక్షక మనస్సులు గెలిచిన పృథ్వీరాజ్.. 'మా' సభ్యుల హృదయాలను మాత్రం చూరగొనలేకపోయారు.
అధ్యక్షునిగా విష్ణు విజయం
'మా' ఎన్నికల(maa elections results) తుది ఫలితాలను ఎన్నికల అధికారి కృష్ణమోహన్ వీటిని అక్టోబర్ 11న ప్రకటించారు. 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు(maa elections manchu vishnu) విజయం సాధించారు. జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్.. వైస్ ప్రెసిడెంట్లుగా మాదాల రవి, బెనర్జీ.. జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్, గౌతమ్ రాజు.. కోశాధికారిగా శివబాలాజీ విజయం సాధించారు.
గెలిచిన ఈసీ సభ్యుల్లో శివారెడ్డి, గీతాసింగ్, అశోక్ కుమార్, బ్రహ్మాజీ, శ్రీలక్ష్మి, మాణిక్, ప్రభాకర్, తనీష్, హరినాథ్ బాబు, సురేష్ కొండేటి, శివన్నారాయణ, ఘర్షణ శ్రీనివాస్, సంపూర్ణేశ్ బాబు, శశాంక్, సమీర్, సుడిగాలి సుధీర్, బొప్పన విష్ణు, కౌశిక్ ఉన్నారు.
ఇదీ చూడండి: Maa elections 2021: 'మా' ఎన్నికల తుది ఫలితాలు ఇవే