మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో(MAA Elections 2021) అసలు ఘట్టం మొదలైంది. 2021-23 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు అక్టోబర్ 10న ఎన్నికలు జరుగనుండటం వల్ల మా ఎన్నికల అధికారి నామినేషన్లకు తెర తీశారు. 26 మంది కార్యవర్గ సభ్యుల కోసం మా కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలుపెట్టారు. ఈసారి అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్(Maa elections Prakash Raj Panel) తన ప్యానల్‌తో కలిసి వచ్చి మా అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. శ్రీకాంత్, బెనర్జి, హేమ, జీవిత రాజశేఖర్ సహా ఇతర కార్యవర్గ సభ్యులతో నామినేషన్ వేయించారు. నామినేషన్ సందర్భంగా ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఉన్న సభ్యులు మద్దతుగా నినాదాలు చేయడం వల్ల మా కార్యాలయం దద్దరిల్లింది.
"మా ఎన్నికల విషయంలో మేము ఒక అడుగు ముందే ఉంటున్నాం. సవ్యంగా ఎన్నికలు జరగాలని ఆకాంక్షిస్తున్నా. 'మా' అభ్యుదయం కోసం పనిచేయడమే మా ప్యానల్ లక్ష్యం. అక్టోబర్ 3న తన ఎన్నికల ప్రణాళిక వెల్లడిస్తాం."
-ప్రకాశ్ రాజ్, 'మా' అధ్యక్ష అభ్యర్థి.(maa elections prakash raj)
ప్రధానమంత్రి ఎన్నికలను తలపిస్తున్నాయి
మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ తరపున జనరల్ సెక్రటరీ పదవికి నామినేషన్ దాఖలు చేసిన జీవిత రాజశేఖర్(maa elections 2021 jeevitha panel).. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రధానమంత్రి ఎన్నికలను తలపిస్తున్నాయన్నారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో జరగాల్సిన ఎన్నికలు ఇబ్బందికరంగా జరగడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మంచు విష్ణు ప్యానల్ నుంచి పోటీ చేస్తున్న పృథ్వీరాజ్ ఆరోపణలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. వ్యక్తిగత ఆరోపణలతో పరిశ్రమ పరువు తీయొద్దని కోరారు. మాటలతో కాకుండా చేతలతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని వివరించారు. మా ఎన్నికల కోసం ప్రకాశ్ రాజ్ పక్కా ప్రణాళికను తయారు చేశారన్నారు. ఈ ఎన్నికల్లో చిరంజీవి మద్దతు ఎటువైపు ఉంటుందో స్పష్టత లేదన్న ఆమె... విష్ణుకు కూడా ఆయన మద్దతు ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు.
బండ్ల గణేశ్ కూడా
జీవితపై జనరల్ సెక్రటరీగా పోటీచేస్తున్న బండ్ల గణేశ్(bandla ganesh mla election) కూడా అ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఒంటరిగానే మా కార్యాలయానికి వచ్చిన ఆయన... ఇంట్లో పూజ చేసి తీసుకొచ్చిన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. ఈ ఎన్నికల్లో తన గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేసిన ఆయన... తనకు పరమేశ్వరుడి మద్దతు ఉందని వ్యాఖ్యానించారు. తాను గెలిస్తే అగ్ర హీరోలందరితో గచ్చిబౌలి స్టేడియంలో ఈవెంట్ నిర్వహించి 25 కోట్ల నిధులు సమకూరుస్తానని, సుమారు 100 మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తానని మరోసారి హామీ ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో రెండు ప్యానల్స్ అభ్యర్థులు ఓటర్లను విందులు, సమావేశాల పేరుతో మభ్యపెడుతున్నారని, అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అధ్యక్షుడిగా ప్రకాశ్ రాజ్, విష్ణు(maa elections 2021 vishnu panel) ఎవరు గెలిచినా తనకు వాళ్లు ప్రెసిడెంటేనని పేర్కొనడం విశేషం.
విష్ణు రేపు
మా ఎన్నికల్లో మూడో అభ్యర్థిగా రంగంలోకి దిగిన సీనియర్ నటుడు సీవీఎల్ నర్సింహారావు కూడా అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. మంచు విష్ణు(maa elections 2021 vishnu panel) తన ప్యానల్‌తో కలిసి రేపు నామినేషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఇదీ చూడండి: MAA Elections 2021: 'మా' అధ్యక్ష పదవికి ప్రకాశ్‌రాజ్ నామినేషన్