ETV Bharat / sitara

'పెద్దల మద్దతు అవసరం లేదు.. నా సత్తా చూపిస్తా' - Prakash Raj fire on Manchu vishnu

తన ప్రత్యర్థి(Maa elections manchu vishnu panel) మంచు విష్ణు, పూర్వ అధ్యక్షుడు నరేష్​పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు 'మా' అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాశ్​రాజ్(maa elections prakash raj panel)​. ఎన్నో ఎదురుదెబ్బలను తట్టుకునే 'మా' ఎన్నికల దాకా వచ్చానన్నారు. కళామతల్లి బిడ్డల పేరుతో సినీ పరిశ్రమను అవమానిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

prakash raj
ప్రకాశ్​రాజ్​
author img

By

Published : Oct 4, 2021, 10:08 AM IST

Updated : Oct 4, 2021, 11:24 AM IST

'మా' ఎన్నికల్లో(maa elections 2021) తనకు ఎలాంటి పెద్దల మద్దతు అవసరం లేదని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్(maa elections prakash raj) అన్నారు. తన సత్తాతోనే ఈ ఎన్నికల్లో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు పెద్దల పేరుతో అసోసియేష్​ను మసకబార్చారని విమర్శించిన ప్రకాశ్ రాజ్.. వాళ్లను ప్రశ్నించేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ప్రకాశ్​రాజ్​

అక్టోబర్ 10న జరిగే ఎన్నికలను పురస్కరించుకొని మరోసారి తన ప్యానెల్ సభ్యులు, పలువురు నటీనటులతో ప్రత్యేకంగా సమావేశమైన ప్రకాశ్ రాజ్(maa elections prakash raj team).. ఎన్నో ఎదురుదెబ్బలను తట్టుకొనే 'మా' ఎన్నికల దాకా వచ్చానన్నారు. తన ప్రత్యర్థి మంచు విష్ణు, పూర్వ అధ్యక్షుడు నరేష్​పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'మా' అధ్యక్షుడిగా తెలుగు నటీనటులే ఉండాలన్న నరేష్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రకాశ్ రాజ్.. తనకంటే తెలుగు ఎవరూ బాగా మాట్లాడలేరని సమాధానమిచ్చారు. సినీ పరిశ్రమలో(maa elections schedule) ఐక్యత పేరుతో చెప్పే మాటలన్ని అబద్దాలన్ని అన్నారు. కళామతల్లి బిడ్డల పేరుతో సినీ పరిశ్రమను అవమానిస్తున్నారని ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో సభ్యులు కోపంతో, కసితో ఓటు వేయాలని, మంచు ఫ్యామిలీ కావాలో లేక మంచి ప్యానెల్ కావాలో తెల్చుకోవాలని ప్రకాశ్ రాజ్ సూచించారు.

ఇదీ చూడండి: 'మెగా ఫ్యామిలీ నిలబడి ఉంటే.. విష్ణుకి నో చెప్పేవాడిని'

Last Updated : Oct 4, 2021, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.