ETV Bharat / sitara

ప్రకాశ్​రాజ్​ను సన్మానించడం నచ్చలేదు: పృథ్వీరాజ్ - manchu vishnu panel

'మా' ఎన్నికలు(maa elections 2021) ఈసారి ఆసక్తికరంగా ఉండనున్నాయి. ఇవి సినిమాలకు సంబంధించినవే అయినా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు దీని గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో నటుడు పృథ్వీరాజ్ ఆడియో లీక్​ కావడం చర్చనీయాంశమైంది.

actor prithviraj on prakash raj news
పృథ్వీరాజ్
author img

By

Published : Oct 7, 2021, 4:34 PM IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ 'మా' ఎన్నికలు(maa elections 2021) రసవత్తరంగా మారాయి. ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు(manchu vishnu panel) ప్యానల్స్‌ పరస్పర ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే విష్ణు ప్యానల్‌ నుంచి పోటీ చేస్తున్న నటుడు పృథ్వీరాజ్‌కు(prithviraj age) సంబంధించిన ఓ ఫోన్‌ కాల్‌ ఆడియో ఇప్పుడు పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది. దేశంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చని.. కాకపోతే పరిపాలించే అర్హత మాత్రం ఉండదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అంతటా వైరల్‌గా మారాయి. ప్రకాశ్‌రాజ్‌ను(prakash raj panel) ఉద్దేశిస్తూ ఆయన చేసిన ఈ కామెంట్స్‌ ఇప్పుడు పరిశ్రమలోనే చర్చనీయాంశంగా మారాయి.

ఆంధ్రప్రదేశ్‌ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు చెందిన ఓ సభ్యుడికి పృథ్వీరాజ్‌ ఫోన్‌ కాల్‌ చేసి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. "నాకు వైజాగ్‌తో మంచి అనుబంధాలున్నాయి. నా రాజకీయ ప్రస్థానం మొదలైంది వైజాగ్‌ నుంచే. అయితే, మీరు ఇటీవల ప్రకాశ్‌రాజ్‌ను సన్మానించడం నాకు ఏమాత్రం నచ్చలేదు. ఆయనకు మీరు ఎలా మద్దతు ఇస్తారు? ప్రకాశ్‌రాజ్‌ క్రమశిక్షణ బాలేదని ఫిల్మ్‌ ఛాంబర్‌ అసోసియేషన్‌(film chamber hyderabad) ఆయన్ని రెండుసార్లు సస్పెండ్‌ చేసింది. నేను ఓ కన్నడ సినిమా షూట్‌లో ఉన్నప్పుడు.. 'కన్నడ వాళ్లు మాత్రమే ఇక్కడ నటించాలి' అని నాపై ఆయన కేకలు వేశాడు. భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చు. కానీ మనల్ని మాత్రం పరిపాలించకూడదు. అలాంటిది మీకు ఆయన ఎందుకు అంత నచ్చాడు? పరాయిభాష వాళ్లపై మీకు అంత ఇష్టమేమిటి? ఏదీ ఏమైనా నా స్లోగన్‌ ఒక్కటే 'తెలుగువాడిని గెలిపిద్దాం.. తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం" అని పృథ్వీరాజ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.