ETV Bharat / sitara

ప్రముఖ రచయిత వెన్నెలకంటి కన్నుమూత - గుండెపోటుతో వెన్నెలకంటి మృతి

ప్రముఖ సినీ గేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూశారు. గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు.

Lyricist vennelakanti died
ప్రముఖ రచయిత వెన్నెలకంటి కన్నుమూత
author img

By

Published : Jan 5, 2021, 5:44 PM IST

Updated : Jan 5, 2021, 7:01 PM IST

ప్రముఖ సినీ గేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూశారు. చెన్నైలోని ఆయన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్.‌ డబ్బింగ్‌ చిత్రాలకు పాటలు రాయడంలో ప్రసిద్ధి చెందారు. దాదాపు 2000 పాటలు రాసి సినీ అభిమానుల్ని అలరించారు.

ఈయన ఇంటి పేరు వెన్నెలకంటి. ఎన్నో సూపర్‌హిట్‌ పాటలు ఆయ‌న క‌లం నుంచి జాలువారాయి. అనేక డ‌బ్బింగ్ చిత్రాల‌కు మాట‌లు, పాట‌లు అందించారాయ‌న‌. దాదాపు 2వేల పాట‌ల వరకు రాశారు. 'మ‌హ‌ర్షి' లోని పాట‌లు ఆయ‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ఆయ‌న రాసిన పాట‌లోని పంక్తి 'చిరున‌వ్వుల వ‌ర‌మిస్తావా చితి నుంచి లేచొస్తా.. మ‌రుజ‌న్మ‌కు క‌రుణిస్తావా… ఈ క్ష‌ణ‌మే మ‌ర‌ణిస్తా' పాట చాలా పాపుల‌ర్ అయ్యింది.

క‌మ‌ల్ హాస‌న్‌కు ప్రీతిపాత్రునిగా వెన్నెలకంటి ఉన్నారు. ఆయ‌న సినిమాలు తెలుగులో డ‌బ్బింగ్ అయితే… మాట‌లు – పాట‌లు రాసే బాధ్య‌త వెన్నెల కంటిదే. కుమారులు శ‌శాంక్ వెన్నెల‌కంటి, రాకేందు మౌళి కూడా గీత ర‌చ‌యితలుగా స్థిర‌ప‌డుతున్నారు. ఆయన హరికథలు, అత్యాద్మిక ప్రసంగాలు వినడం అంటే చాలా ఇష్టపడేవారు. కాలేజి రోజుల్లో 'రసవినోదిని' రేడియో ప్రసంగాలు వినేవారు. 11 ఏళ్లకే కవితలు, పద్యాలూ రాశారు.

1975లో విజయవాడ రేడియో కేంద్రం కవితల పోటీలలో 9 కవితలు సెలెక్టు అయ్యాయి. జంద్యాల రాసిన ఏక్ దిన్కా సుల్తాన్, ఈ చరిత్ర ఏ సిరాతో, ఎవ్వనిచే జనించు, దర్పణం వంటి నాటకాలలో నటించారు. డా. ప్రభాకర్ రెడ్డి ప్రోద్బలముతో శ్రీరామచంద్రుడు సినిమాలో చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల అనే పాట రాశారు పాట వ్రాసారు. అదే గీత రచయితగా తొలి పరిచయం. అటు తర్వాత 'అన్నా చెల్లెలు'లో పాటలు వ్రాసారు. 'నాయకుడు' సినిమాతో అనువాదంలో ప్రవేశించారు. 'ప్రేమాగ్ని' సినిమాకు తెలుగులో మాటలు వ్రాసారు.

  • ప్రముఖ గీత రచయిత, సాహితీవేత్త శ్రీ వెన్నెలకంటి గారు పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. నెల్లూరుకు చెందిన వారు నాకు అత్యంత ఆత్మీయులు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/znpAxulbsi

    — Vice President of India (@VPSecretariat) January 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఉపరాష్ట్రపతి సంతాపం

"ప్రముఖ గీత రచయిత, సాహితీవేత్త శ్రీ వెన్నెలకంటి గారు పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. నెల్లూరుకు చెందిన వారు నాకు అత్యంత ఆత్మీయులు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను" అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్​ చేశారు.

Last Updated : Jan 5, 2021, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.