ETV Bharat / sitara

"బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా..' అలా పుట్టింది!'

author img

By

Published : Mar 28, 2021, 9:40 AM IST

'బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా..' అంటూ సంగీతప్రియుల్ని తన లిరిక్స్​తో మాయ చేశారు గీత రచయిత రామజోగయ్య శాస్త్రి. యూట్యూబ్​లో యాభై కోట్ల వీక్షణలు దక్కిన తొలి దక్షిణాది పాటగా రికార్డు నెలకొల్పింది. అయితే ఇంతటి మాయ చేసిన ఈ పాట పుట్టుక వెనకున్న విశేషాలను రచయిత రామజోగయ్య శాస్త్రి సరదాగా పంచుకున్నారు.

buttabomma buttabomma, Ramajogaiah sasthri
"బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా..'

కొన్ని పాటలు చిలిపిగా చక్కిలిగింతలు పెడతాయి. కొన్ని గమ్మత్తయిన పోలికలతో మాయ చేస్తాయి. ఇంకొన్ని చక్కటి భావుకతతో మనసుని మీటుతాయి. మరి ఈ మూడూ ఒకే పాటలో ఉంటే..! అదే 'అల వైకుంఠపురంలో'ని 'బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా'. యూట్యూబ్‌లో యాభై కోట్ల వీక్షణల్ని దాటిన తొలి దక్షిణాది సినిమా పాట ఇది. ఇంతటి మాయ చేసిన ఈ పాట పుట్టుక వెనకున్న విశేషాల్ని పంచుకుంటున్నారు గీత రచయిత రామజోగయ్య శాస్త్రి..

పెద్ద సవాలు!

'అల వైకుంఠపురంలో' సినిమా కోసం చివరిగా రాయించిన పాట ఇది. అప్పటికే మా గురువుగారు సీతారామశాస్త్రి 'సామజవరగమన..', తమ్ముడు కాసర్లశ్యామ్‌ 'రాములో రాములా..' విడుదలై పెద్ద హిట్టయిపోయాయి. మొదటిది క్లాస్‌ అయితే రెండోది పక్కా మాస్‌. నా పాట ఆ రెండింటికీ మధ్యస్తంగా సన్నివేశానికి తగ్గట్టు ఉండాలన్నారు దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.

lyricist Ramajogaiah sasthri
రామజోగయ్య శాస్త్రి

కథాపరంగా హీరో ప్రేమను నాయిక అంగీకరించిన సందర్భంగా వస్తుందీ పాట. నాకూ, తమన్‌కీ ఆ సన్నివేశాలనీ చూపించారు. ఎంత స్వేచ్ఛ తీసుకున్నా ఫర్వాలేదుకానీ పాట సాహిత్యం సరళంగా ఉండాలనీ చెప్పారు. నిజానికి అదే పెద్ద సవాలు. బరువైన పదాలతో రాయడమంత సులభం కాదు కదా.. యువతరాన్ని ఆకట్టుకునే సరళమైన పదాలతో రాయడం! ఆ బరువును తలనిండా మోస్తూ ఇంటికొచ్చాను.

ఇందులో హీరోయిన్‌ పేరు అమ్ము. ఆ పేరుకు ప్రాస కుదిరే కొత్త పోలికలు ఉండాలనుకున్నాను. అంటుకుంటే వదలని బబుల్‌గమ్మూ, అనుకోకుండా వచ్చే తుమ్మూ, దిమ్మతిరిగే మైండు సిమ్మూ వంటివి అలా వచ్చి చేరాయి. కథానాయకుడు భాష విషయంలో ఏ పటాటోపాలూ లేనివాడు గనక 'ఇంతకన్నా మంచి పోలికేదీ తట్టలేదుకానీ అమ్మూ.. ఈ లవ్వనేది బబుల్‌గమ్ము.. అంటుకున్నాదంటె పోదు నమ్మూ!' అని రాశాను. ప్రేమను తుమ్ముతో పోల్చి చెప్పడం తెలుగు పాటల్లో ఇప్పటిదాకా ఉన్నట్టు లేదు. సాహిత్యంలో ఉందా.. గుర్తులేదు! కానీ ఎవరో ఒకరు చెప్పి ఉండకపోరా అన్న సంశయంతో 'ముందు నుంచి అందరన్నమాటెగాని మళ్లీ అంటున్నానే అమ్మూ.. ఇది చెప్పకుండా వచ్చె తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్మూ!' అని పెట్టాను. ఆ తర్వాతి పాదాలన్నీ ధారగా వచ్చేశాయి.

అవి పూర్తయ్యాక అసలైన ఘట్టం. వినేవాళ్లని పట్టిలాగే అసలైన 'హూక్‌' ఆ తర్వాతే వస్తుంది. దానికి తగ్గ పదాలు పడితే ఈ పాటకి సంబంధించి సగం గోదారిని దాటేసినట్టే. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు నేను ఇదివరకు రాసిన 'వెళ్లిపోకె శ్యామలా'(అ ఆ), 'అమ్మో.. బాపుగారి బొమ్మో'(అత్తారింటికి దారేది) లాంటి 'హూక్‌' దీనికి రావాలని మథనపడ్డాను. ఎన్నెన్నో పదబంధాలని రాసుకున్నాక చివరిగా 'బుట్టబొమ్మా బుట్టబొమ్మా' తట్టింది! త్రివిక్రమ్‌కీ అది బాగా నచ్చింది. బన్నీకి వినిపిస్తే తానూ ఖుషీ అయ్యాడు. అలా పల్లవి, అనుపల్లవి రికార్డు చేశాము. ఆ తర్వాత చరణం వంతు..

lyricist Ramajogaiah sasthri
'బుట్టబొమ్మ' పాట లిరిక్స్​

నేను సందేహించాను కానీ..

చరణం కోసం నాకు నచ్చిన ఓ నాలుగు వాక్యాలు వచ్చాయికానీ.. పదాలు కాస్త బరువుగా ఉన్నాయేమో త్రివిక్రమ్‌ మెచ్చడేమో అనిపించింది. తటపటాయిస్తూనే అర్ధరాత్రి ఫోన్‌ చేసి 'రాజుల కాలం కాదూ.. రథమూ గుర్రం లేవూ/అద్దం ముందర నాతో నేనె యుద్ధం చేస్తాంటే/గాజుల చేతులు చాపీ దగ్గరకొచ్చిన నువ్వూ/చెంపల్లో చిటికేసి చక్కరవర్తిని చేశావే' అన్న పాదాలు చెప్పాను. 'ఇంతకంటే మంచి భావం ఏం కావాలండీ.. ఇదే వాడేద్దాం' అన్నాడు. తర్వాత 'వేలి నిండా నన్ను తీసీ బొట్టుపెట్టూకుంటివే/కాలికిందీ పువ్వు నేనూ నెత్తినెట్టూకుంటివే' అని రాశాను. ఓ స్టార్‌హీరోకి ఇలా చెప్పొచ్చా అనిపించింది కానీ దర్శకుడు తన హీరో ప్రేమకి ఆ మాటలే సరిపోతాయన్నాడు.

తమన్‌ మామూలు పల్లవి-చరణం-పల్లవి అన్న ధోరణిలో కాకుండా పాటని కొత్తగా చేశాడు కాబట్టి.. ఈ వాక్యాలని పల్లవి బాణీకి చక్కటి హంగులా మార్చాడు. దాంతో పాట ఓ రూపుకొచ్చింది. మొత్తానికి ఏదో గొప్పగా చేయాలని కాకుండా సరళంగా ఉంటే చాలనుకుని చేసిన ఈ పాట.. అనుకోకుండా జరిగిన అద్భుతం అని చెప్పాలి.

ఈ పాట విన్న మా గురువు సిరివెన్నెలగారు 'కవర్‌పేజీకి' చక్కటి తెలుగుమాట ఏమిటా అని చాలా ఆలోచించానయ్యా.. ముఖచిత్రం అన్నది మరీ హెవీ అనిపించింది.. అట్టబొమ్మ అన్నది నాకూ తట్టింది. ఈలోపు నువ్వు నీ 'బుట్టబొమ్మ'కి దాన్ని చక్కగా వాడుకున్నావు.. బావుంది!' అని అభినందించారు. పాటలు నేర్పిన గురువు నుంచి అలాంటి ప్రశంస రావడంకన్నా ఇంకేం కావాలి!

ఇదీ చూడండి: 'అలాంటి సన్నివేశం భవిష్యత్తులోనూ చేయను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.