ETV Bharat / sitara

'కలరాను కాల్చేశాం.. మశూచిని మసి చేశాం'

కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలను సినీప్రముఖులు అనేక విధాలుగా తెలియజేస్తున్నారు . స్వీయ నిర్బంధంలో ఉంటూనే వారికి తోచిన పలు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. తాజాగా సినీగేయ రచయితలు, సంగీత దర్శకులు కలిసి ఈ మహమ్మారిపై పాటలు స్వరపరుస్తున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో చంద్రబోస్​, సంగీత దర్శకుడు వాసూరావు చేరారు.

Lyricist Chandrabose and music Director Vaasurao composed a song on corona virus
'కలరాను కాల్చేశాం.. మశూచిని మసి చేశాం'
author img

By

Published : Apr 4, 2020, 10:15 AM IST

కరోనాపై ప్రజల్లో అవగాహన కోసం ప్రభుత్వం అనేక రకాల ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సినీప్రముఖులు వారికి తోచిన విధంగా ప్రజలు జాగ్రత్తలు వహించాలని కోరుకుంటున్నారు. ఇటీవలే పలువురు గాయకులు ఈ మహమ్మారిపై పాటలు విడుదల చేశారు. ఇప్పుడీ జాబితాలో సినీగేయ రచయిత చంద్రబోస్​, సంగీతం దర్శకుడు వాసూరావు చేరారు.

రచన: చంద్రబోస్‌

గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: వాసూరావు

పల్లవి: కలరాను కాల్చేశాం.. మశూచిని మసి చేశాం

ప్లేగును పడగొట్టేశాం.. ఫ్లూను పాతి పెట్టేశాం

కరోనాను తరిమేద్దాం సోదరా

మన కర్తవ్యం మరవద్దు చెల్లెలా..

వచనం: ఎంత పెద్ద పనివున్నా.. ఎంత రాచకార్యమైన

ప్రాణం కన్నా ఏదీ ప్రాముఖ్యం కాదంటూ

చరణం: ఇంట్లోనే ఉండాలి.. ఇళ్లు కదలకుండాలి

శుభ్రంగా మెలగాలి.. చేతులు కడిగెయ్యాలి

ధైర్యంగా నిలవాలి.. దూరంగా మసలాలి

పుకార్లను వదంతులను పక్కన పెట్టెయ్యాలి

ప్రభుత్వాలు చెప్పినట్టి పద్ధతి పాటించాలి

కనిపించని శత్రువుని ఖబడ్దార్‌ అనెయ్యాలి

మహమ్మారి రోగానికి మన శక్తిని చూపాలి

వైద్యునికి పోలీసుకి పారిశుద్ధ్య సిబ్బందికి

వందనాలు చెయ్యాలి సోదరా

పాదాభివందనాలు చెయ్యాలి చెల్లెలా

కరోనాను తరిమేద్దాం సోదరా

మన కర్తవ్యం మరవద్దు చెల్లెలా..

"కరోనా గురించి జాగ్రత్తల్నే, మరోసారి గుర్తు చేస్తూ ఈ పాట రాశా. ఇదివరకు మనకు ఎన్నో విపత్తులొచ్చాయి. వాటిని తెలివితేటలు, నిబద్ధత, ఆత్మస్థైర్యంతో దాటుతూ వచ్చాం. ఈసారి మరింత జాగ్రత్తగా అడుగేయాలి. క్రమశిక్షణతో ఉండి పోరాడితే కచ్చితంగా ఫలితం వస్తుందనే ఆశావహ ధృక్పథం ఈ పాటలో కనిపిస్తుంది. కనిపించని శత్రువుని ఖబడ్దార్‌ అనాలి అని కూడా ఇందులో రాశా. ప్రభుత్వాల సూచనల్ని పాటించాలని, పుకార్లని నమ్మద్దని ఇలా అందరికీ అర్థమయ్యేలా ఈ పాట రాశా. మన కోసం శ్రమిస్తున్న పోలీసులు, వైద్యులు, పారిశుధ్య సిబ్బందికి వందనాలు చేయాలని గుర్తు చేశా. కరోనా ఎలా కనిపించకుండా భయపెడుతోందో, అలా మేమూ బయట ఎవ్వరికీ కనిపించకుండా, ఒకరినొకరు కలుసుకోకుండానే ఈ పాటని తయారు చేశాం. గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సంగీత దర్శకుడు వాసూరావు చెన్నైలోనే ఉంటూ ఫోన్‌ ద్వారానే ఈ పాటని సిద్ధం చేశారు."

- చంద్రబోస్‌, గేయ రచయిత

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"కరోనాపై పాట చేయాలని ఈటీవీ నుంచి ఫోన్‌ వచ్చింది. లాక్‌డౌన్‌తో చెన్నైలో ఇంట్లో ఉండిపోయా. కానీ తప్పకుండా చేయాల్సిన పాట ఇదనిపించింది. వెంటనే నా సహాయకులకు ఫోన్‌ చేస్తే వాళ్లు ఈ పరిస్థితుల్లో రాలేమని చెప్పారు. కోరస్‌ గాయకులూ అదే చెప్పారు. అప్పుడు 'స్మార్ట్‌ రికార్డర్‌' అనే యాప్‌ని డౌన్‌ లోడ్‌ చేసుకుని మా కుటుంబ సభ్యులు మంజరీరావు, అనూష, దుర్గాప్రసాద్‌ సహాయంతో బాణీ కట్టా. గాయకులకు అదే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోమని చెప్పా. ఎవరెవరు ఏ శ్రుతిలో పాడాలో తెలియాలి కాబట్టి జాల్రా అనే యాప్‌ ద్వారా టెంపో నెంబర్లు చెబుతూ అందరితోనూ ఈ పాట పాడించా. ఎస్పీ బాలుగారూ అదే చేశారు. వాళ్ల దగ్గర్నుంచి వాయిస్‌ ఫైల్స్‌ తెప్పించుకున్నా. వాటన్నిటినీ దీన్‌దయాళ్‌ అనే సౌండ్‌ ఇంజినీర్‌కి పంపించి ఈ పాటని సిద్ధం చేయించా. ఇదొక గమ్మత్తైన అనుభవం."

- వాసూరావు, సంగీత దర్శకుడు

ఇదీ చూడండి.. ఇంట్లో ఉండండి బాబూ.. ఇంట్లో ఉండండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.