కరోనా వైరస్ ప్రకృతి ప్రజలకు ఇచ్చిన శాపమని ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ అభివర్ణించారు. ఆ శాపాన్ని దశరథమహారాజు, అహల్య తరహాలో వరంగా మార్చుకోవాలని ప్రజలకు సూచించిన చంద్రబోస్.. కరోనా వైరస్ పట్ల భయం, కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు. కరోనా వల్ల వచ్చిన లాక్డౌన్ సమయాన్ని పుస్తకాలు చదువుతూ, కుటుంబంతో ఆహ్లాదకరంగా గడుపుతూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
"కరోనా వల్ల భయపడాల్సిన పనిలేదు. కంగారుపడాల్సిన అవసరం లేదు. ఈ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుందాం. మంచి పుస్తకాలు చదువుదాం, మంచి సినిమాలు చూద్దాం. భార్యాపిల్లలతో ఎక్కువ సమయం గడుపుదాం. మన వృత్తి జీవితానికి సంబంధించిన కొత్త నైపుణ్యాలను మెరుగుపరుచుకుందాం. కరోనాపై విజయం సాధిద్దాం. కరోనాను అంతం చేద్దాం. కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం." అంటూ ప్రజలకు సందేశానిచ్చారు చంద్రబోస్.