ETV Bharat / sitara

మలయాళంలో 'లవ్​స్టోరీ'.. 'నాట్యం' టీమ్​కు చిరు కంగ్రాట్స్​ - చిరంజీవి నాట్యం సినిమా

కొత్త సినిమా కబుర్లు మిమ్మల్ని పలకరించేందుకు వచ్చాయి. ఇందులో 'సమ్మతమే', 'రౌడీబాయ్స్'​, 'నాట్యం', 'ధాకడ్'​ చిత్రాల సంగతులు ఉన్నాయి.

lovestory
లవ్​స్టోరీ
author img

By

Published : Oct 19, 2021, 2:34 PM IST

శేఖర్​కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా 'లవ్​స్టోరీ' ఇటీవల విడుదలై సూపర్​హిట్​గా నిలిచింది. ఇప్పడీ చిత్రాన్ని ప్రేమతీరమ్​ పేరుతో మలయాళంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్​ 29నుంచి థియేటర్లలో ప్రదర్శితమవుతుందని వెల్లడించింది.

cinema
లవ్​స్టోరీ

యువహీరో కార్తిక్ అబ్బవరం నటించిన కొత్త సినిమా 'సమ్మతమే'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్​ గ్లింప్స్​ను అక్టోబర్ 21న ఉదయం 10.10గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఈ మూవీలో చాందిని చౌదరి హీరోయిన్​గా నటించింది. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు.

sammatamey
సమ్మతమే

శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ఆశిష్​ రెడ్డి, అనుపమ పరమేశ్వరన్​ జంటగా నటించిన చిత్రం 'రౌడీబాయ్స్​'. ఈ చిత్రంలోని 'ప్రేమే ఆకాశం' సాంగ్​ను అక్టోబర్​ 20న సాయంత్రం 7గంటలకు హీరో విజయ్​దేవరకొండ విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్​ సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని రేపింది.

cinema
రౌడీబాయ్స్​

బాలీవుడ్​ హీరోయిన్​ కంగనా రనౌత్​ నటించిన 'ధాకడ్'​ సినిమా విడుదల తేదీ ఖరారైంది. 2022 ఏప్రిల్​ 8న థియేటర్లలో రిలీజ్​ కానుంది. అర్జున్​ రాంపాల్​, దివ్య దత్త కీలక పాత్రలు పోషించారు. రజ్నీష్​ ఘాయ్​ దర్శకుడు.

cinema
ధాకడ్​

ప్ర‌ముఖ కూచిపూడి నృత్య‌కారిణి సంధ్య‌రాజు ప్రధానపాత్ర న‌టిస్తోన్న చిత్రం 'నాట్యం'. ఈ చిత్రాన్ని నిశృంకల ఫిల్మ్స్​ బ్యానర్​పై నిర్మిస్తుండగా.. రేవంత్​ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్​ 22న థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం. ఈ సందర్భంగా మెసాస్టార్​ చిరంజీవి.. మూవీ టీమ్​తో కలిసి ముచ్చటించారు. సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. వారికి ఆల్​ ది బెస్ట్​ చెప్పారు. ఈ మూవీలో కమల్​ కామరాజు, రోహిత్​ బెహల్​, భానుప్రియ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

cinema
నాట్యం
cinema
ఝోస్ట్​బస్టర్స్​
cinema
10th క్లాస్​ డైరీస్​

ఇదీచూడండి: అందంతో మత్తెక్కిస్తున్న 'బిగ్​బాస్​ బ్యూటీ'..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.