ETV Bharat / sitara

పండుగ రోజున 'సీటీమార్​'.. 'లవ్​స్టోరీ' లేనట్టే! - టాలీవుడ్​ మూవీ అప్​డేట్స్​

శేఖర్​ కమ్ముల దర్శత్వంలో తెరకెక్కిన 'లవ్​స్టోరీ' చిత్రం మరోసారి వాయిదా పడినట్లు సమాచారం. మరోవైపు సెప్టెంబరు 3న రిలీజ్​ కావాల్సిన 'సీటీమార్​' 10వ తేదీన విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

love story movie new release date
పండుగ రోజున 'సీటీమార్​'.. 'లవ్​స్టోరీ' లేనట్టే!
author img

By

Published : Aug 28, 2021, 9:24 AM IST

నాగచైత్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్​స్టోరీ'. శేఖర్​ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే ఓసారి వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రం మరోసారి వాయిదా పడనున్నట్లు సినీ వర్గాల్లో టాక్​ వినిపిస్తోంది. సెప్టెంబరు 10న వినాయక చవితి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై ఇప్పుడు చిత్ర బృందం వెనక్కి తగ్గినట్లు గుసగుసలు వినిస్తున్నాయి. 'లవ్​స్టోరీ'ని సెప్టెంబరు చివరి వారంలో లేదా అక్టోబరులో తొలివారంలోవిడుదల చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ వార్తే నిజమైతే అభిమానులకు కాస్త నిరాశే.

పండక్కి సీటీమార్​..

గోపీచంద్​ కథనాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'సీటీమార్​'. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కథానాయికగా తమన్నా నటిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా రిలీజ్​ డేట్​ను మరోసారి వెనక్కి జరిపినట్లు టాలీవుడ్​లో చర్చ జరుగుతోంది. సెప్టెంబరు 3న విడుదల కావాల్సిన ఈ సినిమాను పండుగ పూట సెప్టెంబరు 10న రిలీజ్​ చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే రోజు నాని నటించిన 'టక్​ జగదీశ్'​ ఓటీటీలో విడుదల కావడం గమనార్హం.

మాస్ట్రో కూడా..

నితిన్​ కథానాయకుడిగా నటించిన 'మాస్ట్రో' విడుదల కూడా​ వాయిదా పడినట్టు సమాచారం. సెప్టెంబరు 9న హాట్​స్టార్​లో స్ట్రీమ్​ అవ్వాల్సిన ఈ సినిమాను.. మరో తేదీన రిలీజ్​ చేయాలని మూవీ టీమ్​ భావిస్తున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్​ సూపర్​హిట్​ చిత్రం 'అంధాధున్​'కు రిమేక్​గా తెరకెక్కిన మాస్ట్రోలో నభా నటేశ్, తమన్నా కథానాయికలుగా నటించారు.

సెప్టెంబరు 10న 'తలైవీ'

బాలీవుడ్​ స్టార్​ కథానాయిక కంగనా రనౌత్​ నటించిన చిత్రం 'తలైవీ'. ఈ సినిమాను సెప్టెంబరు 10న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి ఏఎల్​ విజయ్​ దర్శకత్వం వహించారు.

ఇదీ చదవండి : దేశభక్తిని రగిల్చిన 75 అద్భుత దృశ్య కావ్యాలివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.