- నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'లవ్‌స్టోరి'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ను ఆదివారం చిత్రబృందం విడుదల చేసింది. రేవంత్ పాత్రలో నాగచైతన్య, మౌనిక పాత్రలో సాయిపల్లవి ఒదిగిపోయినట్టు అనిపిస్తోంది. పవన్ సీహెచ్ అందించిన నేపథ్యసంగీతం ఆకట్టుకుంటోంది. టీజర్ చూస్తుంటే మరో అందమైన ప్రేమకథను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సాయి శ్రీనివాస్, నభా నటేష్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'అల్లుడు అదుర్స్'. సంక్రాంతి కానుకగా జనవరి 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా ఇందులోని టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను సోషల్‌మీడియాలో విడుదల చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- యువ కథానాయకుడు సత్యదేవ్ హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం 'గాడ్సే'. 'బ్లఫ్ మాస్టర్' ఫేమ్ గోపీ గణేశ్ దర్శకత్వంలో.. సీకే కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఇందులో సత్యదేవ్ సరసన హీరోయిన్గా మలయాళ నటి ఐశ్వర్యా లక్ష్మిని చిత్రబృందం ఎంపిక చేసింది.'గాడ్సే' చిత్రంలో హీరోయిన్గా ఐశ్వర్యా లక్ష్మి
ఇదీ చూడండి: రివ్యూ: 'క్రాక్'తో మాస్ మహారాజ్ ఫామ్‌లోకి వచ్చాడా?