ETV Bharat / sitara

వంట చేస్తూ ఈ నటి ఏం చేసిందో తెలుసా? - గరిటె

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 21రోజుల లాక్​డౌన్ అమల్లో ఉంది. ఇళ్లకే పరిమితమైన నటులు కూడా వంటగదులకు చేరుకొని కొత్త కొత్త ప్రయోగాలు చేసేస్తున్నారు. తాజాగా రీచా చాధా దోసెలు చేస్తుండగా జరిగిన ఓ ఫన్నీ సంఘటనను సామాజిక మాధ్యమంలో పంచుకుంది. ఇంతకీ ఈ నటి ఏంచేసిందంటే!

Lockdown diaries: Richa Chadha burns wooden ladle while cooking
వంట చేస్తూ ఈ నటి ఏం చేసిందో తెలుసా!
author img

By

Published : Apr 4, 2020, 6:41 AM IST

ప్రస్తుతం లాక్​డౌన్​ వల్ల చాలా మంది నటులు వంటగదుల్లో చేరి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. వంటలు రాని వారు కూడా నేర్చుకునేందుకు ఇదే మంచి సమయమని భావించి గరిటె తిప్పుతున్నారు. ఇలాంటి ప్రయోగమే చేయడానికి వంటగదికి వెళ్లిన బాలీవుడ్​ నటి రీటా చాధా.. దోసెలు చేస్తూ చెక్కతో చేసిన గరిటెను కూడా కాల్చేసింది. సామాజిక మాధ్యమంలో ఇందుకు సంబంధించిన ఫొటోను పంచుకుంది ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆ ఫొటో వైరల్​ అవుతోంది.

" కేవలం నేను మాత్రమే వంట చేస్తూ గరిటెలను కాల్చగలను. ఈ ఘటనతో నా వంటల నైపుణ్యం ఏంటో అర్ధమైంది."

-- రీచా చాధా, బాలీవుడ్​ నటి

Lockdown diaries: Richa Chadha burns wooden ladle while cooking
వంట చేస్తూ ఈ నటి ఏం చేసిందో తెలుసా!

పెళ్లి వాయిదా

ఈ లాక్​డౌన్ సమయంలో ఇంటి పనులతో బిజీగా ఉన్నందున కొత్త స్క్రిప్ట్​లు చదివే తీరిక లేదని రీచా తెలిపింది. ఇటీవల కొవిడ్​-19 పరీక్షలు చేసుకొని నెగిటివ్​ వచ్చిన ఇద్దరు వృద్ధ దంపతులకు గురుగ్రామ్​లోని ఓ హోటల్ వద్ద ఇబ్బంది పెట్టడంపై ఈ నటి స్పందించింది. ఆ హోటల్​పై రీచా కేసు కూడా పెట్టింది. తర్వాత ఆ సమస్య పరిష్కారమైందని రీచా తెలిపింది. రీచా, అలీ ఫజల్​ల వివాహం ఈనెలలో జరగాల్సి ఉండగా.. కరోనా వ్యాప్తి దృష్ట్యా రద్దు చేసుకున్నారు.

ఇదీ చదవండి: 'విడాకుల విషయంలో మరోసారి ఆలోచించుకోమన్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.