ETV Bharat / sitara

Bigg Boss Telugu 5: బిగ్​బాస్​ హౌస్​ నుంచి లోబో ఎలిమినేట్‌! - bigg boss captaincy task winner

ఈ వారం నామినేషన్స్‌లో సిరి, శ్రీరామ్‌, రవి, లోబో, మానస్‌, షణ్ముఖ్‌ ఉండగా.. తక్కువ ఓట్లు వచ్చిన లోబో ఎలిమినేట్‌ అయిపోయాడు. ఈసారి ఎలాంటి సీక్రెట్‌ రూమ్‌లు లేకుండా లోబో బయటకు వెళ్లిపోయాడు.

lobo
లోబో
author img

By

Published : Oct 31, 2021, 10:37 PM IST

బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి లోబో ఎలిమినేట్‌ అయ్యాడు. ఈ వారం నామినేషన్స్‌లో సిరి, శ్రీరామ్‌, రవి, లోబో, మానస్‌, షణ్ముఖ్‌ ఉండగా.. తక్కువ ఓట్లు వచ్చిన లోబో ఎలిమినేట్‌ అయినట్లు షో వ్యాఖ్యత నాగార్జున ప్రకటించారు. ఇక ఈసారి ఎలాంటి సీక్రెట్‌ రూమ్‌లు లేకుండా లోబో బయటకు వెళ్లిపోయాడు.

మొదట్లో లోబో తనదైన కామెడీతో నవ్వులు పంచాడు. ఇంటి సభ్యులను అనుకరిస్తూ అలరించాడు. ప్రతి ఒక్కరితోనూ కలిసిపోయేవాడు. అయితే, హౌస్‌లోకి రాకముందే రవితో ఉన్న స్నేహం కారణంగా అతడితో ఎక్కువ సమయం ఉండేవాడు. ఒకానొక దశలో రవి ఏది చెబితే అది నమ్మేసేవాడు. టాస్క్‌ల సందర్భంగా తనవంతు కృషి చేసేవాడు. 'వెయిట్‌లాస్‌’ టాస్క్‌ సందర్భంగా నట్‌రాజ్‌ కోసం ఏమీ తినకుండా లోబో నిగ్రహంగా ఉండటం హౌస్‌మేట్స్‌ను ఆశ్చర్యపరిచింది. ఇక నామినేషన్స్‌ సందర్భంగా కొన్నిసార్లు విపరీతమైన ఆగ్రహానికి గురయ్యాడు.

ముఖ్యంగా ప్రియపై లోబో గట్టి గట్టిగా అరవడం వల్ల నాగార్జున సైతం క్లాస్‌ తీసుకున్నారు. అక్కడి నుంచి అతడి ఆట తీరులో మార్పు వచ్చింది. టాస్క్‌ల్లో పెద్దగా ప్రయత్నం చేసేవాడు కాదు. ఉత్సాహంగా పాల్గొనేవాడు కాదు. దీంతో ప్రియ కన్నా ముందు లోబో ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించి అతడిని సీక్రెట్‌ రూమ్‌లో ఉంచాడు బిగ్‌బాస్‌. హోస్ట్‌ నామినేట్‌ చేయడం వల్ల నేరుగా నామినేషన్స్‌లో ఉన్న లోబో గతవారం ప్రియ తప్పులు చేయడం వల్ల ఆమెకు తక్కువ ఓట్లు పడి ఎలిమినేట్‌ అయింది. దీంతో లోబో సేఫ్‌ అయ్యాడు. ఈ వారం ప్రియాంక కోసం లెటర్‌ వదులుకుని నామినేషన్స్‌లో నిలిచి, చివరకు ఎలిమినేట్‌ అయ్యాడు.

దీపావళి సందర్భంగా స్పెషల్ గెస్ట్‌లు వీళ్లే!

బిగ్‌బాస్‌ హౌస్‌లో దీపావళి కాస్త ముందుగానే వచ్చింది. ప్రత్యేక కార్యక్రమాలతో, స్పెషల్ గెస్ట్‌లతో హౌస్‌ సందడి సందడిగా మారింది. నామినేషన్స్‌ సందర్భంగా ఇంటి సభ్యుల నుంచి లేఖలు అందుకోలేకపోయిన హౌస్‌మేట్స్‌కు నాగార్జున లేఖలు ఇచ్చారు. వాటిని చదివి ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు. యాంకర్‌ సుమ ఇంటి సభ్యులను అనుకరిస్తూ అలరించారు. హౌస్‌లో ఎవరెవరు ఎలా ఉంటారు? ఎలా మాట్లాడతారన్నది చేసి చూపించారు. అనంతరం విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ విచ్చేసి ఇంటి సభ్యులతో మాట్లాడారు. వాళ్ల కోసం స్వీట్స్‌ ఇచ్చారు. దివి, అవికా గోర్‌, మోనాల్‌ గజ్జర్‌ల డ్యాన్స్‌ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఇక అవినాష్‌, బాబా భాస్కర్‌ తమదైన పంచ్‌డైలాగ్‌లతో నవ్వులు పంచారు. గాయని, బిగ్‌ బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ కల్పన పాడిన పేరడీ పాటలు కితకితలు పెట్టాయి. 'మంచి రోజులు వచ్చాయి' చిత్ర బృందం సంతోష్‌ శోభన్‌, మెహ్రీన్‌, దర్శకుడు మారుతీ షోకు విచ్చేసి హౌస్‌మేట్స్‌తో సరదాగా ముచ్చటించారు. దీపావళి స్పెషల్ అట్రాక్షన్‌గా శ్రియ నిలిచారు. ఇంటి సభ్యులతో మాట్లాడుతూ తెగ ఆనంద పడిపోయారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.