ETV Bharat / sitara

Heroines: వయసేమో 40ప్లస్​.. పెళ్లికి మాత్రం నో! - సుస్మితా సేన్ పెళ్లి

లాక్​డౌన్​లో చాలామంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని, కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. అయితే 40 ప్లస్​లో ఉన్న కొందరు ముద్దుగుమ్మలు మాత్రం పెళ్లి గురించి ఇంకా ఆలోచించడం లేదు. ఇంతకీ వాళ్లెవరు?

unmarried Heroines
పెళ్లి కానీ హీరోయిన్స్​
author img

By

Published : Jun 14, 2021, 9:21 AM IST

పెళ్లి.. ప్రతిఒక్కరి జీవితంలో ఎంతో మధురమైన అనుభూతి. నటీనటుల జీవితాల్లో మాత్రం ఈ అందమైన సందర్భం కాస్త ఆలస్యంగానే వస్తుంటుంది! ముఖ్యంగా హీరోయిన్లకు మూడు పదుల వయసు దాటుతోందంటే కొత్త హీరోయిన్ల​ కోసం అన్వేషణ మొదలు పెడుతుంది చిత్రసీమ. ఈలోగా అప్పటివరకు చిత్రసీమలో స్టార్​​గా వెలుగొందిన ఈ ముద్దుగుమ్మలు.. ఏ బడా పారిశ్రామికవేత్తనో, రిలేషన్​షిప్​లో ఉన్నవారితోనే లేదా సెలబ్రిటీనో పెళ్లి చేసుకుని సెటిల్​ అయిపోతారు. ఆ తర్వాత అడపాదడపా తెరపై కనువిందు చేస్తారు లేదా కనుమరుగైపోతారు.

అయితే కొంతమంది నటీమణులు మాత్రం 40 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండానే ఉన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల(రిలేషన్​షిప్​ బ్రేక్​ అవ్వడం, పెళ్లి మీద ఆలోచన లేకపోవడం, ఇతరత్ర కారణాలు) వైవాహిక జీవితానికి ఇంకా దూరంగానే ఉంటూ కెరీర్ కొనసాగిస్తున్నారు. అక్కగానో, వదినగానో లేక ఇతరత్రా సహాయ పాత్రలతోనే కెమెరా ముందు కనిపిస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ల గురించే ఈ స్టోరీ.

సితార

సితార.. బుల్లితెర, వెండితెరపై పలుహిట్​ ధారావాహికలు, చిత్రాల్లో మూడు దశాబ్దాలుగా అలరిస్తోంది. హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత సహాయనటిగా కెరీర్​ను కొనసాగిస్తోంది. తెలుగులో శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, లెజెండ్​, అరవింద సమేత, హలోగురు ప్రేమ కోసమే, మిస్టర్​ మజ్ను వంటి పలు సినిమాల్లో కనువిందు చేసింది. పెళ్లి చేసుకనే ఆలోచన లేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

sithara
సితార

నగ్మా

మెగస్టార్​ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్​, బాలకృష్ణ, రజనీకాంత్​ సహా పలు స్టార్​ హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో చక్కని అభినయంతో క్రేజ్​ సంపాదించుకుంది. 1990లో 'బాఘీ: ఏ రెబల్​ ఫర్​ లవ్'​ హిందీ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ 2009లో సినిమాలకు గుడ్​బై చెప్పి ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతోంది. ఈమెకూ ఇప్పట్లో పెళ్లి జరిగేలా కనిపించడం లేదు!

nagma
నగ్మ

టబు

తెలుగు, తమిళ, హిందీ హిట్​ చిత్రాల్లో స్టార్​ హీరోలతో నటించి యూత్​లో క్రేజ్​ సంపాదించుకున్న నటి టబు. ఇప్పటికీ విభిన్నచిత్రాల్లో నటిస్తూ కెరీర్​లో జోరు చూపిస్తోంది. ఇటీవల 'ఏ సూట్​బుల్​ బాయ్'​ వెబ్​సిరీస్​తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం 'భుల్​ భులయ్య2'లో నటిస్తోంది. నాలుగు పదులు దాటినా సరే ఇప్పటికీ పెళ్లి గురించి ఈమెకు ఎలాంటి ఆలోచన లేనట్లు ఉంది!

tabu
టబు

సుస్మితా సేన్​

మిస్ యూనివర్స్, సీనియర్ నటి సుస్మితా సేన్​ నాలుగు పదుల వయసులోనూ తన ఫిట్​నెస్​లో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రస్తుతం రోహ్మన్​ షాల్​తో రిలేషన్​షిప్​లో ఉంటోంది. వీరిద్దరూ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వీరు ఇద్దరు పిల్లలనూ దత్తత తీసుకున్నారు.

sushmitha
సుస్మితా సేన్​

కౌసల్య

అల్లుడుగారు వచ్చారు, పంచదార చిలక వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ నటి.. ప్రస్తుతం క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా స్థిరపడింది. పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న ఈమె.. పెళ్లి గురించి ఏం మాట్లాడట్లేదు.

kousalya
కౌసల్య
kousalya
కౌసల్య

ముడు పదుల వయసు దాటిన హీరోయిన్లు అనుష్క, నయనతార, తమన్నా సహా పలువురు కూడా ఇంకా పెళ్లి పీటలు ఎక్కలేదు. వీళ్లు ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారో చూడాలి?

anushka
అనుష్క

ఇదీ చూడండి: అందంతో మాయ చేస్తున్న తారలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.