లిప్ కిస్‌లు.. ఎక్కువగా ఉన్న చిత్రమేది? అని అడగ్గానే ఏ కొత్త చిత్రమో అయ్యుంటందని చాలా మంది అనుకుంటారు. కానీ 92 ఏళ్ల క్రితమే ఘాటైన అదరచుంబనాలున్నాయి ఓ సినిమాలో. కాకపోతే అది తెలుగు చిత్రం కాదనుకోండి. 1926 ఆగస్టు 6న విడుదలైన హాలీవుడ్ చిత్రం డాన్ జువాన్ ఎక్కువ ముద్దులున్న సినిమాగా రికార్డు సృష్టించింది.
ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించిన ఎస్టెలీ టైలర్, మేరీ ఆస్టర్ 191 సార్లు ముద్దు పెట్టుకుంటారు. వీరిద్దరూ ఆ తరంలో అందాల తారలుగా పేరుగాంచారు. మూకీ చిత్రంగా విడుదలైన ఈ సినిమా అదిరిపోయే అదరచుంబనాలతో అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సినిమాకు మిశ్రమ ఫలితాలొచ్చినప్పటికీ కేవలం ఈ ముద్దు సీన్లతో వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి అలాన్ క్రాస్లాండ్ దర్శకత్వం వహించాడు.
ఇవీ చదవండి: స్కాట్లాండ్లో ఆటకు '83' జట్టు సిద్ధం