పూరీజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న భారీ ఎంటర్టైనర్ సినిమా 'లైగర్'(liger movie shooting). ఈ మూవీలో దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు(liger film mike tyson). లాస్‌వెగాస్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే షూటింగ్ మధ్యలో కాస్త విరామ సమయం దొరకడం వల్ల సరదాగా గడిపారు విజయ్, అనన్య పాండే. వీరిద్దరూ కలిసి గుర్రపు స్వారీ చేస్తూ ఎంజాయ్ చేశారు(vijaydevarkonda ananya pandey horse ride). దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది అనన్య. 'హౌడీరౌడీ' అని క్యాప్షన్ జోడించింది. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇటీవలే మైక్‌టైసన్‌తో విజయ్, అనన్య, పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి దిగిన ఫొటోలను చిత్రబృందం పోస్ట్ చేయగా.. అవి కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
పాన్ ఇండియా స్థాయిలో ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా తర్ఫీదు పొందారు.
ఇదీ చూడండి: 'లైగర్' బాయ్స్ చిల్.. 'సత్యమేవ జయతే 2' ట్రైలర్