ETV Bharat / sitara

'అద్భుత జ్ఞాపకాలను సృష్టించడమే జీవితం' - Rajkummar Rao latest news

జీవితమంటే అద్భుత జ్ఞాపకాలను సృష్టించడమేనని అంటున్నాడు బాలీవుడ్​ నటుడు రాజ్​కుమార్​ రావు. సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు దగ్గరగా ఉండే రాజ్​కుమార్​.. తాజాగా స్విమ్మింగ్​ పూల్​లో ఈతకొడుతూ, స్నేహితులతో ఆహ్లాదంగా గడుపుతున్న చిత్రాలను షేర్​ చేశాడు.

Life is all about creating wonderful memories: Rajkummar Rao
‘అద్భుతమైన జ్ఞాపకాలను సృష్టించడమే జీవితం’
author img

By

Published : Aug 31, 2020, 9:07 AM IST

బాలీవుడ్​ నటుడు రాజ్​కుమార్​ రావు తనకు సంబంధించిన రెండు జ్ఞాపకాలను సోషల్​మీడియా వేదికగా పంచుకున్నాడు. ఓ చిత్రంలో స్విమ్మింగ్​ పూల్​లో ఈత కొడుతూ ఆనందిస్తుండగా.. మరొక చిత్రంలో తన ప్రేయసి పత్రలేఖతో పాటు అతని స్నేహితులతో కలిసి ఉన్నాడు.

"జీవితమంటే అద్భుత జ్ఞాపకాలను సృష్టించడమే" అంటూ పోస్ట్​ చేశాడు రాజ్​కుమార్​ రావు. ఇటీవలే మ్యాన్​ బుకర్​ ప్రైజ్​ గెలుచుకున్న "ది వైట్​ టైగర్​" నవల ఆధారంగా రూపొందనున్న చిత్రంలో బాలీవుడ్​ నటి ప్రియాంకా చోప్రాతో కలిసి నటించనున్నాడు.

హన్సాల్​ మెహతా దర్శకత్వంలో తెరకెక్కనున్న కామెడీ డ్రామా ‘ఛలాంగ్​’లో రాజ్​కుమార్​ సరసన నుష్రత్​ భరూచా నటిస్తోంది. ‘లూడో’, ‘రూహి అఫ్జానా’ సినిమాల్లోనూ ప్రధానపాత్ర పోషిస్తున్నాడు నటుడు రాజ్​కుమార్​ రావు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.