ఆయన కంఠస్వరంలో రసవాహిని ఉప్పొంగుతోంది.. మాధుర్యం అంబరాన్ని తాకుతుంది. ఆయన సంగీతం ఖండాంతరాల్లో ఉండే భారతీయ సంతతిని సైతం ఉత్తేజింపజేస్తోంది. ఆయనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. తన మధురమైన గాత్రంతో ఏళ్లుగా అలరిస్తున్న ఆయన.. కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించారు. వాటి గురించి ఓసారి తెలుసుకుందాం.
19 నందులు పొందిన గాన గంధర్వుడు బాలు - ఎస్పీ బాలు వార్తలు
ఆయన పూర్తిపేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. అయితే ప్రపంచానికి, సంగీతాభిమానులకు మాత్రం ఎస్పీ బాలూనే. శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోయినా.. దాదాపు 40 వేలకు పైగా పాటల్ని పాడి గిన్నిస్ రికార్డు సాధించిన ఘనత ఆయనది. ఒకేరోజు 21 పాటలు పాడటం, కెరీర్లో 19 నందులు అందుకోవడం ఆయనకే చెల్లింది.
ఒకేరోజు 35 పాటలు పాడిన ఘనత బాలుకే సొంతం