ETV Bharat / sitara

'నేను నిర్మాతగా మారడానికి మణిరత్నమే ప్రేరణ' - సినీ నిర్మాత

తాను సినీ నిర్మాతగా మారడానికి ప్రేరణగా నిలిచిన వ్యక్తి మణిరత్నమేనని తెలిపారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎ ఆర్​ రెహమాన్. ఆయన తాజాగా నిర్మాత-కథకుడిగా పనిచేస్తున్న మూవీ '99 సాంగ్స్​'. ఈ సినిమాకి విశ్వేశ్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నారు.

Leading music director AR Rahman said that Mani Ratnam was the person who made him become a film producer.
'నేను నిర్మాతగా మారడానికి మణిరత్నమే ప్రేరణ'
author img

By

Published : Apr 4, 2021, 8:57 AM IST

ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ నిర్మాత-కథకుడిగా పనిచేస్తున్న చిత్రం '99 సాంగ్స్'. ఏప్రిల్‌ 16న ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "నేను సినీ నిర్మాతగా మారడానికి కారణం మణిరత్నం. ఓసారి ఆయన నాతో 'మీకు సినిమా ఎలా చేయాలో తెలుసు. పాట ఎలా పాడుతారో తెలుసు, దాన్ని ట్యూన్‌ చేసి నేపథ్య సంగీతం అందిస్తారు. చివరికి అందంగా బయటకు వస్తోంది" కదా అని ప్రోత్సహించారు.

ఇదీ చదవండి: చిరంజీవి ఎందుకిలా చేస్తున్నారు?

"కథలపై నాకున్న ప్రేమే నన్ను ఇటువైపు నెట్టేసింది. మొత్తం ఈ పక్రియ అంతా ఒక కథలాంటింది. కథ రాయడం అంటే మరొక కళ గురించి మన సొంత భాషలో మాట్లాడటం. అది ఎంతో బాగుంటుంది. నాకు స్ఫూర్తినిచ్చింది. కథలను ఇష్టపడతాను, ప్రేమిస్తాను. ప్రజల జీవితాలను అధ్యయనం చేయడం అంటే నాకు చాలా ఇష్టం. లోకంలో మన భారతీయ సంస్కృతికి చెందిన వారు మాత్రమే కాదు, ఇతర సంస్కృతుల ప్రజలు కూడా ఉన్నారు" అని రెహమాన్ తెలిపారు.

విశ్వేశ్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న '99 సాంగ్స్' చిత్రంలో ఈహాన్‌ భట్‌, ఎడిల్సీ వర్గీస్‌ నాయకా నాయికలుగా నటిస్తున్నారు. చిత్రాన్ని జియో స్టూడియోస్‌ సమర్పణలో ఐడియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, వైయమ్‌ మూవీస్‌ కలిసి నిర్మిస్తున్నాయి. రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు.

ఇదీ చదవండి: వాటితో 'వైల్డ్​డాగ్'​ను పోల్చకండి: నాగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.