జెట్ స్పీడ్‌తో కెరీర్‌ను పరుగులు పెట్టించే కథానాయికలంతా.. వాయిదా పడిన వినోదాల్ని వడ్డీతో సహా తీర్చేస్తున్నారు. వారానికొక చిత్రం చొప్పున బాక్సాఫీస్ ముందుకు తీసుకొస్తూ.. ప్రేక్షకుల్ని వినోదాల జల్లుల్లో తడిపేస్తున్నారు (tollywood news). చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నా.. కరోనా పరిస్థితుల వల్ల గతేడాది ఒక్క చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేక పోయింది నటి తమన్నా. ఇప్పుడా లోటును వారం వ్యవధిలోనే వరుస సినిమాలతో తీర్చే ప్రయత్నం చేస్తోంది మిల్కీబ్యూటీ.

వినాయక చవితి సందర్భంగా 'సీటీమార్' చిత్రంతో బాక్సాఫీస్ ముందుకొచ్చిన ఈ భామ.. ఈ వారం 'మాస్ట్రో'తో ఓటీటీ (maestro ott) వేదికగా ప్రేక్షకుల్ని పలకరించనుంది. తమన్నా ప్రతినాయక ఛాయలున్న ఓ శక్తిమంతమైన పాత్రలో కనిపించనుంది. అందుకే ఆమె కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన ఈ చిత్రం కోసం సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది తమన్నా నుంచి 'గుర్తుందా శీతాకాలం' (tamanna bhatia latest movie) అనే మరో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది.

'ఛల్ మోహనరంగ' సినిమా తర్వాత పూర్తిగా తమిళ చిత్రసీమకే పరిమితమైపోయింది నటి మేఘా ఆకాష్. ఈ ఏడాది మాత్రం వారాల వ్యవధిలోనే రెండు తెలుగు చిత్రాలు విడుదల చేసి ప్రేక్షకుల్ని మెప్పించింది. సెప్టెంబరు ఆఖరి వారంలో శ్రీవిష్ణుతో కలిసి 'రాజ రాజ చోర' సినిమాతో బాక్సాపీస్ ముందుకొచ్చిన ఈ భామ.. ఈనెల తొలి వారం అరుణ్ అదితో కలిసి 'డియర్ మేఘ'గా (dear megha cast) థియేటర్లలో సందడి చేసింది.

వీటిలో 'రాజ రాజ చోర'కు సినీప్రియుల నుంచి మంచి ఆదరణ దక్కినా... 'డియర్ మేఘ'తో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆమె ప్రస్తుతం 'గుర్తుందా శీతాకాలం' చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

'టాక్సీవాలా' చిత్రం తర్వాత రెండేళ్ల పాటు వెండితెరపై కనిపించలేదు సీమ సుందరి ప్రియాంక జవాల్కర్, ఓవైపు వరుస సినిమాలతో సెట్స్‌పై తీరిక లేకుండా ఉన్నా.. కరోనా తెచ్చిన విరామం వల్ల వాటిని ప్రేక్షకులకు చూపించలేకపోయింది. ఇప్పుడా చిత్రాల్లో రెండింటిని వారాల వ్యవధిలో బాక్సా ఫీస్ ముందుకు తీసుకొచ్చి సినీప్రియులకు వినోదం పంచిచ్చింది.

జులై ఆఖరి వారంలో 'తిమ్మరుసు' సినిమాతో థియేటర్లలో సందడి చేసిన ఈ అమ్మడు.. ఆ మరుసటి వారమే 'ఎస్ ఆర్.కళ్యాణమండపం' చిత్రంతో బాక్సాఫీస్ తలుపు తట్టింది. ఇప్పుడీ భామ 'గమనం' సినిమాతో (priyanka jawalkar gamanam) మళ్లీ సిద్ధమవుతోంది. శ్రియ, నిత్యా మేనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో ప్రియాంక ఓ కీలక పాత్రలో నటించింది.

సుజనారావు తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది.


వీళ్లే కాదు.. ప్రస్తుతం 'టక్ జగదీష్' (tuck jagadish ritu varma) సినిమాతో ఓటీటీ వేదికగా వినోదాలు పంచుతున్న రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ మరికొన్ని వారాల్లోనే మరో చిత్రంతో బాక్సాఫీస్ ముందుకు రానున్నారు.

సాయితేజ్‌కు జోడీగా ఐశ్వర్య నటించిన 'రిపబ్లిక్' చిత్రం (republic movie heroine) అక్టోబరు 1న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక నాగశౌర్యతో కలిసి రీతూ నటించిన 'వరుడు కావలెను' సినిమా సైతం అక్టోబరులోనే థియేటర్లలోకి రానుంది.

ఇదీ చూడండి: Avika gor: హీరోయిన్ అవిక అందాల విందు