కథానాయిక హన్సిక ఏకపాత్రాభినయం చేసిన చిత్రం '105 మినిట్స్'(105 minutes movie release date). ఎడిటింగ్ లేకుండా సింగిల్ షాట్లో కేవలం ఆరు రోజుల్లోనే రూపొందించిన చిత్రమిది. ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ శుక్రవారం విడుదల చేశారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ చిత్రం టీజర్ ఉంది. రాజు దుస్సా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకంపై బొమ్మన్ శివ నిర్మించారు. తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మరో పోస్టర్..
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం 'స్టూవర్ట్‌పురం దొంగ'(Stuvartpuram donga new movie). దీపావళి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను చేయగా.. శుక్రవారం మరో పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న బెల్లంకొండ హీరో.. సినీ ప్రియుల్ని ఆశ్చర్యపరిచారు. వీవీ వినాయక్ శిష్యుడు కేఎస్.. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్..
'ఆర్ఎక్స్ 100', 'గ్యాంగ్ లీడర్' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యువహీరో కార్తికేయ కొత్త చిత్రం 'రాజా విక్రమార్క'(Raja vikramarka 2021 movie release date). ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిల్మ్‌నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో శనివారం సాయంత్రం జరగనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అలరిస్తోంది. శ్రీసారిపల్లి దర్శకుడు. నవంబర్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
రైజ్ ఆఫ్ శ్యామ్..
నాని-సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా 'శ్యామ్‌సింగరాయ్'(shyam singha roy release date). ఈ చిత్రంలో 'రైజ్ ఆఫ్ శ్యామ్' అంటూ సాగే ఫుల్ లిరికల్ పాటను శనివారం ఉదయం 11గంటలకు విడుదల చేయనుంది చిత్రబృందం.
ఛత్రీవాలి షూటింగ్ స్టార్ట్..
రకుల్ ప్రీత్‌సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఛత్రీవాలి'(Chhatriwali movie news). ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. సోషల్ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తేజాస్ ప్రభా విజయ్ డియోస్కార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇదీ చూడండి: 'గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు వచ్చేసేవి'