దిగ్గజ గాయని లతా మంగేష్కర్ నివసిస్తున్న భవంతిని ముంబయి మున్సిపల్ అధికారులు సీల్ చేశారు. కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఇలా చేసినట్లు వెల్లడించారు. దక్షిణ ముంబయి పెద్దర్ రోడ్లోని ప్రభుకుంజ్ బిల్డింగ్లో ఉంటున్నారు లతా.
"నిన్న సాయంత్రం నుంచి 'ప్రభుకుంజ్'ను సీల్ చేశారా? అంటూ విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే దీనిని మూసివేశారు. ఇంట్లో వృద్ధులు ఉండటమే ఇందుకు కారణం. ఇటీవలే వినాయక చవితి సెలబ్రేషన్స్ కూడా భౌతిక దూరం పాటిస్తూనే జరుపుకొన్నాం" -మంగేష్కర్ కుటుంబం ప్రకటన
ఆ భవంతిలో కొందరికి కరోనా సోకిందని, అందువల్లే దానిని మూసివేశారని కొందరు అంటున్నారు. స్పందించిన మంగేష్కర్ కుటుంబసభ్యులు.. తామందరం ఆరోగ్యంగానే ఉన్నామని, అసత్య వార్తలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.