శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు ప్రముఖ గాయని లతా మంగేష్కర్. ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలోని గత సోమవారం చేరారు. అయితే ఇప్పటికీ ఆమె.. ఐసీయూలోనే ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
"ఆమె(లతా మంగేష్కర్) కోలుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఐసీయూలోనే ఉన్నారు" ఆసుపత్రిలోని ఓ వైద్యుడు
ఈ విషయం గురించి లత సోదరి ఉషా మంగేష్కర్ మాట్లాడారు. ఆమె కోలుకుంటున్నారని, వైద్యులు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారనే దాని గురించి ఎదురు చూస్తున్నామని చెప్పారు.
లతా మంగేష్కర్.. తన ఏడు దశాబ్దాల కెరీర్లో 30 వేలకు పైగా పాటలు పాడారు. శ్రోతల్ని అలరించారు. భారతీయ సినీ చరిత్ర అత్యుత్తమ నేపథ్య గాయనిగా పేరు తెచ్చుకున్నారు. భారత ప్రభుత్వం.. ఆమెను 2001లో భారతరత్నతో గౌరవించింది.
ఇది చదవండి: గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం.. కాస్త విషమంగానే!