'లక్ష్మీ బావ.. లక్ష్మీబావ నిన్నే పెళ్లాడతా.. లక్ష్మీబావ లక్ష్మీబావ నీకే పెళ్లానైపోతా' అంటూ నయనతార ఎంతగా అలరించిందో చెప్పనవసరం లేదు. లక్ష్మీబావ ఎవరో కాదు వెంకటేశ్. ఇతడు హీరోగా వి.వి.వినాయక్ తెరకెక్కించిన 'లక్ష్మీ' చిత్రంలోని గీతమిది. నయన్‌తోపాటు ఛార్మి.. వెంకీతో ఆడిపాడింది. ఈ చిత్రంలో వెంకీ, నయన్‌ల కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది.
అయితే నయన్ స్థానంలో ఆర్తి అగర్వాల్ ఉంటే ఎలా ఉండేదో ఊహించుకోండి. ఎందుకంటారా? ముందుగా ఈ కథలో నటించేందుకు ఆర్తి అగర్వాల్‌ను సంప్రదించిందట చిత్రబృందం. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఈ చిత్రంలో నటించలేనని ఆర్తి చెప్పినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. దాంతో ఆమె స్థానంలో నయనతారను ఎంపిక చేశారు. అలా ఆర్తికి కుదరకపోవడం వల్ల నయన్ 'లక్ష్మీ'బావతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">