ETV Bharat / sitara

'సామజవరగమన..' పాటకు కేటీఆర్ ఫిదా - ETV Bharat sitara

'అల.. వైకుంఠపురములో' చిత్రంలోని ప్రతి పాట సరికొత్త రికార్డులను సాధిస్తూ.. ఎల్లలు లేని అభిమానాన్ని చూరగొంటోంది. ఇప్పుడు ఇందులోని 'సామజవరగమన' పాటకు రాష్ట్ర మంత్రి కేటీఆర్​ ఫిదా అయ్యారు.

ktr-appreciate-thaman-for-samajavaragamana-song
'సామజవరగమన..' వినకుండా ఉండ గలమా..!
author img

By

Published : Jan 21, 2020, 5:40 PM IST

Updated : Feb 17, 2020, 9:22 PM IST

"సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా.." పాటకు సంగీత అభిమానులు ఎంత దగ్గర అయ్యారంటే.. "సామజవరగమన.. నిను వినకుండా ఉండగలమా..!" అన్న మాదిరిగా దగ్గరయ్యారు. ఎక్కడ చూసినా ఇదే పాట మారుమోగుతోంది. ప్రతి ఒక్కరికీ మత్తులా ఎక్కేసిన ఈ పాటకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఫిదా అయ్యారు. ప్రస్తుతం దావోస్‌ పర్యటనలో ఉన్న ఆయన తనను మైమరపింపజేసిన సామజవరగమన.. పాటను ప్రశంసిస్తూ మంగళవారం ఉదయం ట్వీట్‌ చేశారు.

"విమానం కాస్త ఆలస్యమైంది. అప్పుడు స్విట్జర్లాండ్‌లో ఉదయం 3.30 అవుతోంది. ఆ సమయంలో 'సామజవరగమన' పాట విన్నాను. నాకు మంచి కంపెనీ ఇచ్చిందీ సాంగ్‌. ఎంతో అద్భుతంగా ఉన్న ఈ పాట వెంటనే నా ప్లేలిస్ట్‌లో చేరిపోయింది. తమన్‌.. ఈ సాంగ్‌తో మిమ్మల్ని మీరే మించిపోయారు" అని ట్వీట్​ చేశారు.

  • Jet lagged & up at 3:30 am Swiss time!

    ‘Samaja Varagamana’ on my playlist keeping me company. What a brilliant song!! @MusicThaman you’ve outdone yourself 👏 Cant get this one out of my head 😀 pic.twitter.com/lUGsopHlT0

    — KTR (@KTRTRS) January 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దీనికి సంగీత దర్శకుడు ఎస్‌.తమన్‌ స్పందిస్తూ.. మీ నుంచి ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉందంటూ కేటీఆర్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాడు. మీ ద్వారా 'సామజవరగమన' పాట మరింత సెన్సేషనల్‌ అవుతుందని ట్వీట్‌ చేశాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ పాటకు దాదాపుగా 14 కోట్ల వీక్షణలు వచ్చాయి. ఇప్పటికే 'అల.. వైకుంఠపురములో' సినిమాలోని ప్రతి పాట సూపర్​హిట్​గా నిలిచాయి. జనవరి 12న విడుదలై సంక్రాంతి బరిలోకి దిగిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగానూ దూసుకెళ్తోంది.
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి:- 'అసురన్' తెలుగు రీమేక్​కు టైటిల్​ ఖరారు!

Intro:Body:Conclusion:
Last Updated : Feb 17, 2020, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.