ETV Bharat / sitara

'గంటలో మరణిస్తారని తెలిస్తే మీరు ఏం చేస్తారు?' - Director Krish

'క్షీరసాగర మథనం' చిత్ర టీజర్​ను శుక్రవారం సోషల్​మీడియాలో విడుదల చేశారు దర్శకుడు క్రిష్​ జాగర్లమూడి. 'గంటలో మరణిస్తారని తెలిస్తే మీరు ఏం చేస్తారు' అనే కథాంశంతో రూపొందిన టీజర్​ వీక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

Ksheera Saagara Madhanam movie teaser released by Director Krish
'గంటలో మరణిస్తారని తెలిస్తే మీరు ఏంచేస్తారు?'
author img

By

Published : Aug 21, 2020, 12:50 PM IST

'మరో గంటలో మరణిస్తారు అని తెలిస్తే మీరు ఏం చేస్తారు?' అని ప్రశ్నిస్తున్నారు ప్రముఖ దర్శకుడు క్రిష్​ జాగర్లమూడి. ఇదే కథాంశంతో తెరకెక్కిన 'క్షీరసాగర మథనం' అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఆ చిత్ర టీజర్​ను శుక్రవారం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు దర్శకుడు క్రిష్​.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"ఎగిసే అలలు.. ఎదలోని భావాలు.. అదుపులో ఉన్నంత వరకు అందంగానే ఉంటాయి" అంటూ సాగే డైలాగ్​ వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఆ ఒక్క డైలాగ్​తోనే స్టోరీలైన్​ను చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు అనిల్​. ఓ వ్యక్తి.. తాను చేసిన తప్పు తెలిసిన క్షణం, అతను మరణానికి దగ్గరవుతుంటే ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే అంటోంది చిత్రబృందం.

'క్షీరసాగర మథనం' టీజర్​కు సామాజిక మాధ్యమాల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రానికి అనిల్​ పంగులూరి దర్శకత్వం వహించగా.. అలేఖ్య నిర్మాతగా వ్యవహరించారు. అజయ్​ అరసాద సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.