ETV Bharat / sitara

ఫ్యాన్స్​కు మాటిచ్చిన కృతిశెట్టి.. అదేంటంటే? - కృతిశెట్టి భావోద్వేగ పోస్ట్​

Uppena Kritishetty: 'ఉప్పెన'తో తెలుగు తెరకు పరిచయమైన కృతిశెట్టి వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్​లో దూసుకెళ్తోంది. తాజాగా సోషల్​మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్​ చేసిన ఆమె.. అభిమానులకు ఆ విషయంపై మాట ఇచ్చింది. అదేంటంటే?

Kritishetty emotional post about uppena
కృతిశెట్టి భావోద్వేగ పోస్ట్
author img

By

Published : Feb 12, 2022, 5:08 PM IST

Uppena Kritishetty: గతేడాది టాలీవుడ్‌కు పరిచమైన కొత్తందం కృతిశెట్టి. బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ఆమె నటించిన తొలిచిత్రం 'ఉప్పెన'. అందులో 'బేబమ్మ'గా అందరి మనసులను దోచింది. నేటితో 'ఉప్పెన' విడుదలై సంవత్సరం పూర్తిచేసుకుంది. ఈసందర్భంగా శనివారం కృతి శెట్టి తన ఇన్‌స్టాలో ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది.

"మన జీవితంలో మనకంటూ రెండు పుట్టిన రోజులు ఉన్నట్లైతే.. అందులో ఒకటి మనం పుట్టినరోజు. ఇంకొకటి.. మనం కెరీర్‌లో ఏం చేయాలో ఎంచుకున్న రోజు. ఏడాది క్రితం నటిగా పరిశ్రమలో అడుగుపెట్టా. నేను ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నా.. కాబట్టి ఈరోజు నాకిది మరో పుట్టినరోజుగా భావిస్తున్నా. నేను ప్రేమించే పనిని చేయడం.. అందుకు మీరంతా పాజిటివ్‌గా స్పందించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే నన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఈ ప్రయాణాన్ని గుర్తుండేలా చేసిన నా అభిమానులకు కృతజ్ఞతలు. ఇక పై మరింత కష్టపడి మంచి పాత్రలతో అలరిస్తానని మాట ఇస్తున్నా. థాంక్యూ ఆల్‌" అని రాసుకొచ్చింది.

'ఉప్పెన' తర్వాత గతేడాది నాని 'శ్యామ్‌ సింగ రాయ్‌', ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన నాగార్జున- నాగచైతన్య 'బంగార్రాజు'తో సందడి చేసింది కృతిశెట్టి. ప్రస్తుతం ఆమె చేతుల్లో సుధీర్‌బాబు చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', తెలుగు- తమిళ భాషల్లో రానున్న రామ్‌ హీరోగా 'ది వారియర్‌', నితిన్‌తో 'మాచర్ల నియోజకవర్గం' చిత్రాలు ఉన్నాయి.

ఇదీ చూడండి: అనసూయ లేటెస్ట్​ వీడియో.. మరీ ఇంత హాట్​గానా!?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.