ETV Bharat / sitara

'అలాంటి సన్నివేశం భవిష్యత్తులోనూ చేయను' - కృతి సనన్ మహేష్​బాబు

మహేశ్​బాబు హీరోగా తెరకెక్కిన '1-నేనొక్కడినే' చిత్రంతో హీరోయిన్​గా పరిచయమైన కృతి సనన్​.. ప్రస్తుతం బాలీవుడ్​లో బిజీగా ఉంది. ప్రభాస్​ 'ఆదిపురుష్'​లో సీత పాత్ర పోషిస్తున్న కృతి.. తన మనసులోని భావాలను సరదాగా పంచుకుంది.

kriti sanon
కృతిసనన్
author img

By

Published : Mar 28, 2021, 8:42 AM IST

Updated : Mar 28, 2021, 9:07 AM IST

కొన్నేళ్లక్రితం '1-నేనొక్కడినే', 'దోచేయ్‌' సినిమాల్లో నటించి అభిమానుల మనసు దోచిన కృతి సనన్‌.. ఆ తర్వాత బాలీవుడ్‌కే పరిమితమైంది. ఆరేళ్ల తరువాత ఇప్పుడు 'ఆదిపురుష్‌'లో ప్రభాస్‌ సరసన సీతగా కనిపించబోతున్న ఈ సుందరి తన మనసులోని ముచ్చట్లను చెబుతోందిలా..

kriti sanon interview
కృతిసనన్

జీమ్యాట్‌ రాయమన్నారు!

చిన్నప్పటి నుంచీ హీరోయిన్‌ కావాలని కల కనేదాన్ని. కానీ నాన్న చార్టెడ్‌ అకౌంటెంట్‌, అమ్మ ప్రొఫెసర్‌ కావడం వల్ల చదువై పోయాకే సినిమాలని చెప్పారు. దాంతో ఇంజినీరింగ్‌ చదువుతూనే మోడలింగ్‌ చేసేదాన్ని. తర్వాత ముంబయి వెళ్లి సినిమా ప్రయత్నాలు చేయాలనులకున్నా. అప్పుడు కూడా ఇంట్లోవాళ్లు జీమ్యాట్‌ పరీక్ష రాయమంటూ షరతు పెట్టారు. ఎందుకంటే.. అందులో మంచి మార్కులు వస్తే అయిదేళ్లలోపు ఎప్పుడైనా చదువుకోచ్చనేది వాళ్ల ఆలోచన. సరేనని ముంబయి వచ్చి నా లక్కును పరీక్షించుకున్నా. అప్పుడే '1-నేనొక్కడినే'లో అవకాశం వచ్చింది. అదయ్యాక హిందీ సినిమా. ఆ రెండింటి తర్వాత దొరికిన విరామంలో అమ్మానాన్నలకు మాటిచ్చినట్లుగా ఆ పరీక్ష రాశా. మంచి స్కోరు వచ్చింది. అయినా నాకు ఆ తరువాత చదువుకునే అవకాశం రాలేదనుకోండీ.

మహేశ్​కు ఎంత సహనమో!

నా మొదటి సినిమా మొదటి సీన్‌ని గోవాలో తీశారు. షూటింగ్‌ ప్రారంభించిన రోజే నేను సెట్‌కి ఆలస్యంగా వెళ్లా. అప్పటికే మహేశ్​బాబు వచ్చేసి సీన్‌పేపర్లను చూసుకుంటున్నాడు. నాకు ఏదో తప్పు చేసినట్లుగా అనిపించింది. ఆ టెన్షన్‌లో నేను ఎక్కువ టేకులు తీసుకున్నా.. మహేశ్​ ఏమాత్రం చిరాకు పడకుండా నాతో ఆ సీన్లను మళ్లీమళ్లీ చేయించాడు. ఈ సూపర్‌స్టార్‌కు ఎంత సహనమో అనుకున్నా.

kriti sanon interview
కృతిసనన్

ఒంటరితనం భరించలేకపోయా!

మా నాన్న ఉద్యోగరీత్యా కొన్నిరోజులు ముంబయిలోనూ పనిచేశారు. సినిమా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆయనతోనే ఉండేదాన్ని. అయితే కొన్నాళ్లకు ఆయన ఇంటికెళ్లిపోవడం వల్ల నేను ఒంటరిని అయిపోయాననే భావన మొదలైంది. దాంతో అమ్మకు తరచూ ఫోన్‌ చేసి ఏడ్చేదాన్ని.

చాక్లెట్లు చేయగలను

ముందు నుంచీ నేను ఫుడీనే. నాకు ఎక్కువగా చాక్లెట్లూ, చీజ్‌కేకులూ, కస్టర్డ్‌, మూంగ్‌దాల్‌ హల్వా అంటే ఇష్టం. అవి ఎదురుగా ఉన్నాయంటే డైటింగ్‌ విషయాన్ని పక్కన పెట్టేస్తా. 'రాబ్తా' అనే హిందీ సినిమాలో చాక్లెట్‌షాప్‌ ఓనర్‌గా నటించా. అందులో సహజంగా కనిపించేందుకు చాక్లెట్ల తయారీలో శిక్షణ తీసుకున్నా. ఇప్పుడు ఎన్నిరకాల చాక్లెట్లనయినా సులువుగా చేయగలను.

kriti sanon
కృతిసనన్

కొన్నిసార్లు బాధపడతా

ఎలాంటి విమర్శల్నీ పట్టించుకోను కానీ కొన్నిసార్లు నాకు సంబంధం లేని విషయాలను సామాజిక మాధ్యమాల్లో చదివినప్పుడు మనసు చివుక్కుమంటుంది. కాకపోతే, కాసేపటికే మామూలైపోతా. ట్రోల్స్‌ లాంటివాటిని మాత్రం అసలు పట్టించుకోను.

అమ్మచాటు అమ్మాయిని!

చిన్నప్పుడు ఎవరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదట. ఇంటికి ఎవరైనా వస్తే వాళ్లు వెళ్లిపోయేవరకూ ఓ మూల విగ్రహంలా ఉండేదాన్నని అమ్మ చెబుతుంటుంది. ఒకవేళ వాళ్లు ఏదయినా అడిగితే వెంటనే అమ్మ దుపట్టాను ముఖంమీద కప్పేసుకునేదాన్నట. పెద్దయ్యేకొద్దీ ఆ బిడియం పూర్తిగా పోయింది.

kriti sanon interview
కృతిసనన్

గోవా అంటే ఇష్టం

నాకు ఇష్టమైన ప్రదేశాల్లో మొదటిది గోవా. అక్కడికి ఎన్నిసార్లు వెళ్లినా బోర్‌కొట్టదు.

అలాంటి సీను.. అమ్మో!

'1-నేనొక్కడినే'లో ఓ సీన్‌ షూటింగ్‌ సముద్రం మధ్యలో ఉంటుంది. నాకేమో ఈత రాదు. దాంతో ఎలా చేస్తానోనని భయమేసింది. షూటింగ్‌ అయిపోయాక భవిష్యత్తులో అలాంటి సీను మళ్లీ చేసే అవకాశం రాకూడదనుకున్నా.

kriti sanon interview
కృతిసనన్

కవితలు రాసేదాన్ని

స్కూల్లో, కాలేజీలో ఉన్నప్పుడు నా మనసులోని భావాలన్నింటినీ కవితలుగా రాసుకునేదాన్ని. ఎప్పుడైతే సినిమా ప్రయత్నాలుమొదలుపెట్టానో.. రాయడం తగ్గిపోయింది. ఖాళీ దొరికితే మళ్లీ ప్రయత్నించాలి.

ఇంకా..

నాకు క్రికెట్‌ చూడటమంటే చాలా ఇష్టం. అలాగే, ఎంతసేపైనా సరే ధ్యానం చేస్తూ ఉండిపోతా.

ఇదీ చూడండి: అభిమానులు​ గర్వపడేలా చేస్తా: నాని

Last Updated : Mar 28, 2021, 9:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.