'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' చిత్ర వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు నటి కంగనా రనౌత్ దర్శకుడు క్రిష్‌పై ప్రతివిమర్శలు చేసింది. చిత్రాన్ని కంగనా రనౌత్ 'హైజాక్' చేసిందన్న క్రిష్ ఆరోపణలకు నటి కంగనా రనౌత్ దీటుగా బదులిచ్చింది. క్రిష్ తన ఆరోపణలను నిరూపించాలని రనౌత్ సవాల్ చేసింది.
సినిమాకు తానే పూర్తిగా దర్శకత్వం వహించానని, కంగనా ప్యాచ్‌వర్క్ మాత్రమే చేసిందని క్రిష్ ఆరోపించారు.
"చిత్రంలో క్రిష్‌కు తగిన గుర్తింపు లభించింది. నాపై ఆరోపణలు చేయడం సరికాదు. ఈ అంశంపై నిర్మాతలతోనే మాట్లాడాలి. నేను దర్శకత్వం చేశాను. చిత్రం విడుదలైంది. చివరి నిమిషంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాను."
-కంగనా రనౌత్, సినీ నటి
తనపై ఫిర్యాదులు చేయాలనుకునే నటులతో కలిసి క్రిష్ సినిమా తీయాలని కంగనా ఎద్దేవా చేసింది.
జనవరి 25న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 64 కోట్ల వసూళ్లు రాబట్టింది.