ETV Bharat / sitara

'పెళ్లిసంద..డి' సందడి ఏప్రిల్ 28 నుంచి - movie news

ప్రముఖ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న 'పెళ్లి సంద.. డి' సందడి.. ఈనెల 28 నుంచి మొదలు కానుంది. అయితే ఆ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. అందుకే ఆ రోజు నుంచి ప్రారంభిస్తున్నారు. ఇంతకీ ఏంటా ప్రత్యేకత?

k.raghavendra rao 'pellisandaD'
కె.రాఘవేంద్రరావు
author img

By

Published : Apr 26, 2021, 6:32 AM IST

పాతికేళ్ల కిందట కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం 'పెళ్లిసందడి'. శ్రీకాంత్‌ కథానాయకుడిగా నటించారు. అప్పట్లో ఘన విజయం సాధించిన ఆ చిత్రం పేరును మరోసారి తలపిస్తూ ఇప్పుడు 'పెళ్లిసంద.. డి' తెరకెక్కుతోంది. ఇందులో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.

చిత్రీకరణ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని పాటని ఈ నెల 28న విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌ 28కి ఓ ప్రత్యేకత ఉంది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 'అడవిరాముడు' విడుదలైన రోజు. ఆయన సమర్పణలో రూపొందిన 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' విడుదలైందీ అదే రోజే. అందుకే 'పెళ్లిసంద..డి' పాటను ఆ రోజున విడుదల చేయాలని నిర్ణయించినట్టు సినీ వర్గాలు తెలిపాయి. "ఇది కొత్త కథతో తెరకెక్కుతున్న చిత్రం. నాటి ‘పెళ్లి సందడి’కి కొనసాగింపు చిత్రం కాదు. రొమాంటిక్‌ మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ నెల 28న విడుదల కానున్న పాటతో కె.రాఘవేంద్రరావు - కీరవాణి స్వరాల సందడి మళ్లీ మొదలవుతుంది" అని సినీ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.