మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య'.. వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. లాక్డౌన్ కారణంగా చిత్రీకరణ ఎక్కడికక్కడ నిలిచిపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
తొలుత దసరాకు ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. అనుకోని అవాంతరంలా కరోనా వచ్చిపడింది. దేశమంతా లాక్డౌన్ విధించడం వల్ల షూటింగ్ నిలిచిపోయింది. అనుకున్న తేదీ కాస్త మారింది. మళ్లీ చిత్రీకరణ మొదలై, అన్ని సర్దుకున్నా చాలా సమయం పట్టొచ్చు. అందుకే పరిస్థితి అదుపులోకి వచ్చిన వెంటనే అన్ని కార్యక్రమాలను త్వరగా పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటోంది.
ఇందులో నక్సలైట్ నుంచి ప్రొఫెసర్గా మారిన పాత్రలో నటిస్తున్నారు చిరు. కాజల్ కథానాయిక. మణిశర్మ స్వరాలు అందిస్తుండగా, కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది.
ఇదీ చూడండి : 'తుపాకీ 2' సినిమాకు తమన్ సంగీతం