ETV Bharat / sitara

''కొండపొలం'.. మా జీవితాల్లో అందమైన అనుభూతి' - కొండపొలం మూవీ రివ్యూ

'కొండపొలం' సినిమా విశేషాలతో పాటు షూటింగ్​లో ఎదురైన అనుభవాల్ని వైష్ణవ్​తేజ్-క్రిష్ పంచుకున్నారు. ఈ చిత్రం కోసం పవన్​ కల్యాణ్ ప్రోత్సాహం మరిచిపోలేదని క్రిష్ చెప్పారు.

vaishnav tej
కొండపొలం మూవీ
author img

By

Published : Oct 7, 2021, 6:38 PM IST

'కొండపొలం' నవల ఆధారంగా తీసిన సినిమా 'కొండపొలం'. వైష్ణవ్​తేజ్, రకుల్​ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించారు. నల్లమల అడవి నేపథ్య కథతో తెరకెక్కించిన ఈ చిత్రం.. శుక్రవారం(సెప్టెంబరు 8) థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా ముచ్చటించిన వైష్ణవ్​తేజ్, డైరెక్టర్ క్రిష్.. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

కొండపొలం టీమ్ ఇంటర్వ్యూ

"ఈ నవలను నా కంటే ముందు సుకుమార్, హరీశ్ శంకర్, కొరటాల శివ లాంటి దర్శకులు.. సినిమాగా తీస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. చివరకు ఆ అవకాశం నాకు వచ్చింది. అయితే ఆ కథకు అందమైన ప్రేమకథ జోడీస్తే బాగుంటుందని అనుకున్నా. ఆ ఉద్దేశంతోనే 'కొండపొలం' రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారిని కలిశా. అప్పుడు ఆయన రాసిన 'చినుకుల సవ్వడి' నవలలో ప్రేమకథను ఈ సినిమా కోసం ఉపయోగించాం" అని క్రిష్ చెప్పారు.

kondapolam movie team
కొండపొలం మూవీ పోస్టర్

''కొండపొలం' ప్రపంచంలోకి నేను వెళ్లాను. షూటింగ్​ సమయంలో గొర్రెలు కాయడమే కాదు.. నటనలో చాలా మెలకువలు తెలుసుకున్నాను. రాయలసీయ యాసలో పదాలు పలకడం తొలి రెండు మూడు రోజులు తడబడ్డాను. కానీ తర్వాత అలవాటు అయిపోయింది" అని వైష్ణవ్​తేజ్ చెప్పారు.

"షూటింగ్ కోసం గోవా, నల్లమల అడవులు అని అనుకున్నాం కుదరలేదు. వికారాబాద్​ ఫారెస్ట్​లో ఫైనల్​గా షూటింగ్ చేశాం. మేం సినిమా కోసం 1000 గొర్రెలను తీసుకెళ్లాం. 'కొండపొలం' మాకు గొప్ప సినిమా.. అందమైన అనుభూతిగా మా జీవితాల్లో ఉండిపోతుంది" అని క్రిష్ అన్నారు.

"ఈ సినిమా కోసం 'కొండపొలం' పుస్తకం చదివినప్పుడే చాలా గమ్మత్తుగా అనిపించింది. అప్పుడే ఓ కీలక పాత్ర కోసం కోటా శ్రీనివాసరావుగారే అని ఫిక్సయ్యాను. ఈ విషయాన్ని ఆయనకు చెప్పినప్పుడు నేను సినిమా కోసమే ఎదురుచూస్తున్నాని ఆయన అన్నారు. కరోనా కదా సార్ అంటే అదేం లేదు అని మమ్మల్ని ఆయన ప్రోత్సాహించారు." అని క్రిష్ చెప్పారు.

kondapolam movie team
కొండపొలం మూవీ టీమ్

"రామిరెడ్డిగారు పుస్తకానికే తొలుత 'వనవాసి' అని పేరు పెడదామని అనుకున్నారు. కానీ ఆ తర్వాత 'కొండపొలం' అని నిర్ణయించారు. మేం కూడా సినిమా షూటింగ్​ జరుగుతున్నప్పుడే క్లాప్ బోర్డుపై 'కొండపొలం' అనే రాశాం. ఆ తర్వాత ఓ సారి మాటల మధ్యలో 'వనవాసి' టైటిల్​ గురించి కూడా అనుకున్నాం. కానీ సంగీత దర్శకుడు కీరవాణి మాత్రం 'కొండపొలం' మాత్రమే టైటిల్​ అని, మరేం పెట్టొద్దని నాతో అన్నారు." అని క్రిష్ వెల్లడించారు

"పవన్​కల్యాణ్​తో తీస్తున్న 'హరిహర వీరమల్లు' షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయింది. దీంతో మా టీమ్​ మొత్తం ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు కూడా వచ్చాయి. ఆ సమయంలో నాకు ఈ సినిమా చేయాలని ఉందని అని పవన్​కు చెప్పగా, ఆయనే మాకు ప్రోత్సాహం అందించారు. వేరే హీరో ఎవరైనా అయితే దీనికి అస్సలు అంగీకారం చెప్పరేమో" అని క్రిష్.. పవర్​స్టార్ పవన్​ ప్రోత్సాహం గురించి చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.