ETV Bharat / sitara

కర్నూల్​లో 'కొండపొలం' ఆడియో రిలీజ్​.. 'జై భీమ్​' ఓటీటీ రిలీజ్​ డేట్​ - అమెజాన్​ ప్రైమ్​లో జై భీమ్

టాలీవుడ్​ నుంచి కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. 'కొండపొలం'(Vaishnav Tej Rakul Preet Singh Movie) ఆడియో రిలీజ్​ ఈవెంట్​ సహా 'లవ్​స్టోరి'(Naga Chaitanya Sai Pallavi Movie) మ్యాజికల్​ సెలబ్రేషన్స్​, సూర్య 'జై భీమ్​' సినిమా ఓటీటీ రిలీజ్​ డేట్​(Jai Bhim Movie Release Date) అప్​డేట్స్​ ఇందులో ఉన్నాయి.

Kondapolam - Jai Bheem Movies Release Dates
కర్నూల్​లో 'కొండపొలం' ఆడియో రిలీజ్​.. 'జై భీమ్​' ఓటీటీ రిలీజ్​ డేట్​
author img

By

Published : Oct 1, 2021, 6:00 PM IST

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌, రకుల్ ప్రీత్‌ సింగ్‌(Vaishnav Tej Rakul Preet Singh Movie) జంటగా నటిస్తోన్న చిత్రం 'కొండపొలం'. క్రిష్‌ దర్శకుడు. రాజీవ్‌ రెడ్డి, జె. సాయి బాబు నిర్మాతలు. అక్టోబరు 8న(kondapalem movie release date) ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సినిమా ఆడియో రిలీజ్​ ఈవెంట్​ను శనివారం(అక్టోబరు 2) సాయంత్రం కర్నూల్​లో నిర్వహించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన 'కొండపొలం' నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

Kondapolam - Jai Bheem Movies Release Dates
'కొండ పొలం' ఆడియో రిలీజ్ పోస్టర్​

శేఖర్​ కమ్ముల(Sekhar Kammula News) దర్శకత్వంలో నాగచైతన్య(Naga Chaitanya Sai Pallavi Movie), సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'లవ్​స్టోరి'. సునీల్​ నారంగ్​ నిర్మాతగా వ్యవహరించగా.. పవన్​ సీహెచ్​ స్వరాలను సమకూర్చారు. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో 'లవ్​స్టోరి' సినిమా మ్యాజికల్​ సెలబ్రేషన్స్​ను శుక్రవారం సాయంత్రం హైదరాబాద్​లోని నెక్లెస్​ రోడ్డు వేదికగా నిర్వహించనుంది చిత్రబృందం.

'లవ్​స్టోరి' సెలబ్రేషన్స్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న కొత్త చిత్రం 'జై భీమ్'(Suriya Jai Bhim Movie). సామాజిక, రాజకీయ అంశాలతో రూపొందిన ఈ సినిమాకు టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. రజీషా విజయన్ హీరోయిన్​గా నటిస్తుండగా, ప్రకాశ్​ రాజ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. సూర్య స్వీయ నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ కింద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఓటీటీ విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. అమెజాన్​ ప్రైమ్​ వేదికగా 'జై భీమ్​' సినిమా నవంబరు 2న(Jai Bhim Movie Release Date) విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

'జై భీమ్​' సినిమా రిలీజ్​ పోస్టర్

ఇదీ చూడండి.. MAA Elections: 'మా' ఎన్నికల బరి నుంచి తప్పుకొన్న బండ్ల గణేశ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.