ETV Bharat / sitara

'కొండపొలం', 'డాక్టర్' ట్రైలర్.. 'సూర్యవంశీ' రిలీజ్ అప్​డేట్ - అక్షయ్ కుమార్ సూర్యవంశీ రిలీజ్

సినిమాలకు సంబంధించిన తాజా అప్​డేట్లు వచ్చేశాయి. ఇందులో 'కొండపొలం'(kondapolam movie), 'డాక్టర్', 'సూర్యవంశీ'కి సంబంధించిన విశేషాలు ఉన్నాయి.

Kondapolam
సినిమా
author img

By

Published : Sep 25, 2021, 9:01 PM IST

మెగా హీరో వైష్ణవ్​తేజ్(vaishnav tej new movie) కథానాయకుడిగా నటించిన చిత్రం 'కొండపొలం'(kondapolam movie). క్రిష్​ దర్శకత్వం వహించారు. కీరవాణి సంగీత దర్శకుడు. ఇందులో రకుల్ హీరోయిన్​గా నటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్(kondapolam movie trailer)​ రిలీజ్​కు డేట్ ఫిక్స్ చేసింది చిత్రబృందం. సెప్టెంబర్ 27 మధ్యాహ్నం 3.33 గంటలకు ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 8న ఈ మూవీ థియేటర్లకు రానుంది.

Kondapolam
కొండపొలం

అక్షయ్ కుమార్ హీరోగా రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్​టైనర్ 'సూర్యవంశీ'(akshay kumar sooryavanshi release date). ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కాగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అక్టోబర్ 22 నుంచి మహారాష్ట్రలో థియేటర్లు తెరచుకోనున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్​ను ఖరారు చేసింది చిత్రబృందం. దీపావళి కానుకగా నవంబర్​లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ చిత్రంలో కత్రినా కైఫ్ హీరోయిన్​గా నటించగా.. అజయ్ దేవగణ్, రణ్​వీర్ సింగ్​ అతిథి పాత్రల్లో మెరవనున్నారు.

suryavamsi
సూర్యవంశీ

తమిళంతో పాటు, తెలుగులోనూ అలరిస్తున్న నటుడు శివ కార్తికేయన్‌(sivakarthikeyan movies). ఆయన నటించిన పలు సినిమాలు అనువాదమై ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో శివ కార్తికేయన్‌ నటించిన తాజా మెడికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ 'డాక్టర్'(doctor movie trailer). ప్రియాంక అరుళ్‌ మోహన్‌, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. తాజాగా అక్టోబరు 9న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 'వరుణ్‌ డాక్టర్‌' పేరుతో తెలుగులోనూ విడుదల కానుంది. కాగా, శనివారం ఈ చిత్ర ట్రైలర్‌(doctor movie trailer)ను విడుదల చేశారు. వరుసగా జరుగుతున్న అమ్మాయిల కిడ్నాప్‌లను అడ్డుకునేందుకు ఓ డాక్టర్‌ ఏం చేశాడు? ఎవరెవరి సాయం తీసుకున్నాడు? చివరకు అమ్మాయిలను కిడ్నాప్‌ చేసే ముఠా ఆటకట్టించాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి: వయ్యారి భామలు.. వారెవ్వా అనిపించే పోజులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.