ETV Bharat / sitara

'అందుకే 'అంజి' షూటింగ్​కు ఐదేళ్లు పట్టింది' - అంజి మూవీ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అంజి'. 2004లో విడుదలైన ఈ మూవీ పర్వాలేదనిపించింది. ఈ సినిమా షూటింగ్ దాదాపు ఐదేళ్లు జరిగింది. అందుకు గల కారణాన్ని ఓ సందర్భంలో వెల్లడించారు కోడి రామకృష్ణ.

Kodi Ramakrishna about Anji graphics
అంజి
author img

By

Published : Mar 4, 2021, 5:32 AM IST

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోషియో ఫాంటసీ ఫిల్మ్‌ 'అంజి'. భారీ అంచనాల మధ్య 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. అప్పట్లో హాలీవుడ్‌ సినిమాను తలపించే గ్రాఫిక్స్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దారు. దాదాపు ఐదేళ్లకు పైగా షూటింగ్‌ జరుపుకొందీ చిత్రం. కాగా, ఇందులో విరామ సన్నివేశాలను నెలరోజుల పాటు తీసినట్లు దర్శకుడు కోడి రామకృష్ణ ఓ సందర్భంలో చెప్పారు. సినిమా అంత భారీగా తీయడం వెనుక నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డికి దక్కుతుందన్నారు.

Kodi Ramakrishna about Anji graphics
కోడి రామకృష్ణ

"ఇంటర్వెల్‌ సీన్‌ నెల రోజులు తీశాం. చిరంజీవి కూడా ఓపిగ్గా చేశారు. కేవలం గ్రాఫిక్స్‌ మాత్రమే కాదు. కథ పరంగా అదొక క్లిష్టమైన సబ్జెక్ట్‌. అందులో చిరంజీవిగారిని 'ఒరేయ్‌' అనే పాత్ర ఉంది. ఆయన్ను అలా పిలిచే వ్యక్తిగా ఎవరు సరిపోతారా? అని వెతికాం. చివరికి నాగబాబుగారిని వేషం వేసి పెద్దయ్య పాత్ర ఇచ్చాం. సినిమాకు సంబంధించిన వర్క్‌ కూడా చాలా పెద్దది. కొన్ని సన్నివేశాలకు 100 నుంచి 120 షాట్స్‌ తీయాల్సి వచ్చేది. అలా తీయబట్టే దానికి ఐదేళ్లు పట్టింది. శ్యాంగారు చాలా ఖర్చు పెట్టి సినిమా తీశారు. దీంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ సినిమాకు పని చేస్తుంటే తల తిరిగిపోయేది. ఎందుకంటే గ్రాఫిక్స్‌వర్క్‌ సింగపూర్‌, మలేషియా, అమెరికాల్లో జరిగేది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తీసిన షాట్స్‌ అన్నీ రాత్రికి అమెరికా పంపేవాళ్లం. మరుసటి రోజు ఆ డిస్క్‌లోని షాట్స్‌ వాళ్లు తీసుకుని మళ్లీ అదే రోజు ఆ డిస్క్‌లను ఇక్కడికి పంపేవాళ్లు" అంటూ చెప్పుకొచ్చారు కోడి రామకృష్ణ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.