ETV Bharat / sitara

మూడు భారీ ప్రాజెక్టుల్లో కియారా ఛాన్స్ కొట్టేసింది! - మూడు భారీ ప్రాజెక్టుల్లో కియారా

టాలీవుడ్​లో కొన్ని నెలల్లో పట్టాలెక్కబోయే మూడు భారీ ప్రాజెక్టుల్లో ముద్దుగుమ్మ కియారా అడ్వాణీ అవకాశం దక్కించుకుందట. ఈ విషయమై చిత్రబృందాలు, ఆమెతో చర్చలు జరుపుతున్నాయని సమాచారం. ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే?

Kiyara Adwani gets chance to act in three big projects in tollywood
కియారా అడ్వాణీ
author img

By

Published : Apr 28, 2020, 6:16 AM IST

'కబీర్ సింగ్'తో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్​ కియారా అడ్వాణీ.. తెలుగులో తక్కువ సినిమాలే చేసినా, బాగానే పేరు సంపాదించింది. మహేశ్​ 'భరత్​ అనే నేను', చరణ్​ 'వినయ విధేయ రామ' సినిమాలతో మెప్పించింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే టాలీవుడ్​లో ప్రస్తుతం తెరకెక్కుతున్న మూడు భారీ ప్రాజెక్టుల్లో ఈమె అవకాశం కొట్టేసిందని ప్రచారం సాగుతోంది. ఈ విషయమై జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ జాబితాలో డార్లింగ్ ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా.. ఎన్టీఆర్​-త్రివిక్రమ్, మహేశ్​- పరశురామ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో హీరోయిన్ల పాత్రల కోసం కియారాతో చర్చలు జరుపుతున్నాయి సదరు చిత్రబృందాలు. త్వరలో ఈ విషయాలపై స్పష్టత వచ్చే అవకాశముంది.

ఇదీ చూడండి : విజయ్ రూ.25 లక్షల్ని రూ.43 లక్షలకు పెంచారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.