కింగ్ ఖాన్.. బాలీవుడ్ బాద్షా.. అమ్మాయిల కలల రాకుమారుడు.. ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అతడే షారుఖ్ ఖాన్. పట్టుదల, నిబద్ధత, క్రమశిక్షణే ఆయుధాలుగా స్వయంకృషితో ఎదిగాడు. హిందీ చిత్రసీమలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న షారుక్ ఫుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా కింగ్ ఖాన్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు ఇప్పుడు చూద్దాం!
రెండో చిత్రమే ముందు విడుదల..
షారుఖ్ తొలి చిత్రం ఏంటని అడగ్గానే.. 'దివానా' అని టక్కున చేప్పేస్తారు అభిమానులు. అయితే దివానా కంటే ముందు 'ది అశానా'లో నటించాడు. అయితే కొన్ని కారణాల వల్ల దివానా ముందుగా విడుదలైంది.
రాజ్ డైలాగ్‌తో ఎంతో పాపులర్..
'రాజ్.. నామ్‌తో సునావోంగా..' షారుఖ్ చెప్పే ఈ డైలాగ్ ఎంతో పాపులర్. అయితే రాజ్ అనే పేరుతో కింగ్ ఖాన్ ఆరు చిత్రాల్లో నటించాడు. రాజు బన్ గయా జెంటిల్మన్, దిల్వాలే దుల్హానియా లే జాయేంగే, చల్తే చల్తే, రబ్ నే బనా దే జోడీ ఈ జాబితాలో ఉన్నాయి. రాహుల్ అనే పాత్రలో షారుఖ్ 9 చిత్రాల్లో నటించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
16 చిత్రాల్లో చనిపోయాడు..
హీరో సినిమాల్లో చనిపోయాడంటే ఆ చిత్రం ఆడదనుకుంటారు. కానీ షారుఖ్ 16 సినిమాల్లో మరణించే పాత్రలు పోషించాడు. బాజీఘర్, డర్, దిల్ సే, దేవ్‌దాస్, కల్ హో నా హో తదితర చిత్రాలు ఇందులో ఉన్నాయి. కరణ్ అర్జున్, పహేలీ, రా.వన్, ఓం శాంతి ఓం చిత్రాల్లో మళ్లీ జన్మించే పాత్రలు చేశాడు.
మన్నత్ అంటే ప్రాణం..
షారుఖ్‌కు తన ఇల్లంటే ఎంతో ఇష్టం. 'మన్నత్' అని నామకరణం చేసిన ఆ గృహంలో ప్రత్యేక ప్రార్థనా మందిరం ఉందట. అసలు దాని కోసమే ఈ ఇంటిని కొనుగోలు చేశాడట కింగ్ ఖాన్. తను సంపాదించినదంతా కోల్పోయినా.. మన్నత్‌ను మాత్రం ఎప్పటికీ విక్రయించనని చెప్పాడు షారుఖ్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అందరి బంధువు..
షారుఖ్ పుట్టింది హైదరాబాద్.. అతడి తల్లి హైదరాబాదీ.. తండ్రి పఠాన్. కింగ్ ఖాన్ ఐదేళ్ల వరకు బెంగళూరులో పెరిగాడు. సొంతూరు దిల్లీ. ముంబయికి చెందిన పంజాబీ.. గౌరీ చిబ్బర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును సొంతం చేసుకొని అక్కడా క్రేజ్ తెచ్చుకున్నాడు.
ఒకే ఇల్లు. రెండు మతాలు.. ముగ్గురు పిల్లలు
షారుఖ్ ఖాన్.. గౌరీ చిబ్బర్ (గౌరీ ఖాన్) అనే పంజాబీ అమ్మాయిని హిందూ వివాహ పద్ధతిలో 1991 అక్టోబర్ 25న వివాహం చేసుకున్నాడు. ఆరేళ్ల తరవాత వారికి 1997లో ఆర్యన్, 2000లో సుహానా పుట్టారు. 2013లో అభిరామ్ జన్మించాడు. షారుఖ్ ఇంటిలో హిందూ దేవతల విగ్రహారాధనతో పాటు ఇస్లాం ప్రార్ధనలు కూడా సాగుతూ ఉండడం, అతడి మత సామరస్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
అవార్డులకు లెక్కే లేదు..
కింగ్ ఖాన్ నటనకు అవార్డులు క్యూ కట్టాయి. బాలీవుడ్లో ఇచ్చే వివిధ అవార్డుల్లో 226 నామినేషన్లు దక్కించుకున్నాడు. అందులో 207 పురస్కారాలు అందుకున్నాడు. ఉత్తమ నటుడిగా 30 సార్లు ఫిలింఫేర్‌కు నామినేట్ అయిన ఏకైక నటుడు షారుఖ్ ఖాన్. వాటిలో పద్నాలుగు సార్లు ఆ పురస్కారాన్ని కైవసం చేసుకున్నాడు.
నిర్మాతగానూ..
షారుఖ్ ఖాన్ సొంతంగా ‘రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్’ అనే బహుళార్ధక నిర్మాణ సంస్థను స్థాపించి తద్వారా చిత్ర నిర్మాణం, అడ్వటైజింగ్, విజువల్ ఎఫెక్ట్స్, టెలివిజన్ సీరియళ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టాడు. భార్య గౌరీ ఖాన్ ఈ సంస్థ వ్యవహారాలను చూసుకుంటోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2005లో భారత ప్రభుత్వం షారుఖ్‌ను 'పద్మశ్రీ' పురస్కారంతో గౌరవించింది. ఐక్యరాజ్య సమితి నుంచి పిరమిడ్ కోన్ మార్ని అవార్డు, ఫ్రెంచ్ ప్రభుత్వపు రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు స్వీకరించాడు. 1965 నవంబరు 2న జన్మించిన షారుక్ నేడు 55వ పడిలోకి అడుగుపెట్టాడు.
ఇదీ చదవండి: వరుణ్‌తేజ్‌తో రొమాన్స్‌కు కియారా సై!