బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు రణవీర్ సింగ్.. విభిన్న ఫ్యాషన్‌తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇటీవలే ఈ హీరో వేసుకున్న కాస్ట్యూమ్ చూసి ఓ చిన్నారి భయపడి ఏడ్చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ముంబయిలోని ఓ డబ్బింగ్ స్టూడియో నుంచి రణవీర్ బయటకు వస్తుండగా ఫొటోల కోసం అభిమానులు, విలేకర్లు అతడ్ని చుట్టుముట్టారు. ఫొటోలకు పోజులిస్తూ, కారు ఎక్కుతుండగా అక్కడే ఉన్న ఓ చిన్నారి ఆ స్టార్ హీరోను చూసి భయపడింది. ఒక్కసారిగా వాళ్ల నాన్నను పట్టుకుని ఏడ్చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ ఏడాది 'గల్లీబాయ్'తో మంచి విజయాన్ని అందుకున్నాడు రణవీర్ సింగ్. ఇటీవలే ఉత్తమ విదేశీ భాషా చిత్ర విభాగంలో భారత్ నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయిందీ సినిమా. ప్రస్తుతం భారత దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న '83'లో నటిస్తున్నాడు. ఇందులో కపిల్ సతీమణి రోమీ భాటియా పాత్రలో దీపికా పదుకొణె కనిపించనుంది.
ఇదీ చదవండి...