విజయ్ దేవరకొండ నటించిన ‘'అర్జున్‌రెడ్డి'’ టాలీవుడ్‌లో ఎంత క్రేజ్ సంపాదించిందో తెలిసిన విషయమే. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో 'కబీర్‌సింగ్'గా తెరకెక్కించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అక్కడా ఇదే తరహాలో దూసుకెళ్తోంది.
సినిమా విజయం సాధించినందుకు నటి కియారా అడ్వాణీకి దేవరకొండ ఓ బహుమతి అందజేసి శుభాకాంక్షలు తెలిపాడు. గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్యూ అంటూ కియారా సమాధానం ఇచ్చింది. బాలీవుడ్‌లో అంచనాలను మించి వసూళ్లు రాబడుతోందీ చిత్రం. ఇప్పటికే వంద కోట్ల క్లబ్‌లో చేరి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇవీ చూడండి.. తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా సి. కల్యాణ్