ETV Bharat / sitara

ఓటీటీలో కాదు.. థియేటర్లోనే 'ఇందూ కీ జవానీ' - డిసెంబరు 11న ఇందూ కీ జవానీ రిలీజ్​

బాలీవుడ్​ హీరోయిన్​ కియారా అడ్వాణీ నటించిన 'ఇందూ కీ జవానీ' సినిమాను డిసెంబరు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని చిత్రబృందం ప్రకటించింది. ముందుగా ఓటీటీల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నా.. చివరికి థియేటర్లలోనే రిలీజ్​ చేయడానికి చిత్రయూనిట్​ సిద్ధమైంది.

Kiara Advani's 'Indoo Ki Jawani' to release in theatres on 11th December
ఓటీటీలో కాదు.. థియేటర్లోనే 'ఇందూ కీ జవానీ'
author img

By

Published : Nov 22, 2020, 7:39 AM IST

కియారా అడ్వాణీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'ఇందూ కీ జవానీ'. అబిర్‌ సేన్‌గుప్తా దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిసెంబరు 11న థియేటర్లలో విడుదలవుతోందని చిత్ర బృందం తెలిపింది. ముందుగా ఈ సినిమాను ఓటీటీల్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు థియేటర్లలోనే విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు.

Kiara Advani's 'Indoo Ki Jawani' to release in theatres on 11th December
'ఇందూ కీ జవానీ'లో కియారా అడ్వాణీ

ఈ చిత్రంలో కియారాకి జోడీగా ఆదిత్య సీల్‌ నటించాడు. డేటింగ్‌ యాప్‌ల ద్వారా తన భాగస్వామిని అన్వేషించే ఇందూ అనే యువతి పాత్రలో కియారా నటించింది.ఈ సినిమాకు సంబంధించిన హసీనా పాగల్​ దివానీ పాట టీజర్​ ఇటీవలే విడుదలై ఆకట్టుకుంది. నేటితరం మనోభావాలను ప్రతిబింబిస్తూ చక్కటి వినోదాన్ని పంచే చిత్రంగా 'ఇందూ కీ జవానీ' నిలుస్తుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.