బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్ పాన్ ఇండియా మూవీలో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించనున్నారని వార్తలొస్తున్నాయి. ఇందులో కథానాయికగా కియారా అడ్వాణీ నటించనుందని సమాచారం. హిందీలో 'కబీర్ సింగ్' విడుదలైన తర్వాత కియారాకి మంచి అవకాశాలే లభిస్తున్నాయి.
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా దర్శకుడు శంకర్ ఓ సినిమా రూపొందించనున్నట్లు ఇటీవలే ప్రకటన వచ్చింది. అయితే అన్నీ సక్రమంగా జరిగితే రామ్‌చరణ్ చిత్రం కంటే ముందుగానే రణ్వీర్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కపిల్‌దేవ్ జీవితాధారంగా తెరకెక్కిన '83' చిత్రంలో హీరో రణ్వీర్ ప్రధానపాత్రలో నటించారు. ఈ ఏడాది జూన్ 4న సినిమా విడుదల కానుంది. మరోవైపు రోహిత్ శెట్టి దర్శకత్వంలో 'సర్కస్' అనే చిత్రంలోనూ ప్రధానపాత్ర పోషిస్తున్నారు. ఇక కియారా సైతం 'భూల్ భులయ్యా 2', 'జగ్ జుగ్ జీయో' లాంటి సినిమాలతో బిజీగా ఉంది. దర్శకుడు శంకర్ ఇప్పటికే కమల్‌హాసన్‌తో 'ఇండియన్ 2' తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అరవై శాతంపైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మరి శంకర్ ఏ సినిమాను ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్తాడో వేచి చూడాల్సిందే.
ఇదీ చూడండి: 'శ్యామ్ సింగరాయ్'లో నానికి పోటీగా మరో హీరో!