'లస్ట్ స్టోరీస్', 'కబీర్ సింగ్'లతో ఉత్తరాది సినీప్రియులకు తనలోని బోల్డ్ నటనను రుచి చూపించిన కియారా అడ్వాణీ.. తెలుగు తెరపై మాత్రం పద్ధతైన పాత్రల్లోనే మెప్పించింది. ఆమె ఇక్కడ చేసిన తొలి చిత్రం 'భరత్ అను నేను' మంచి ఆదరణ దక్కగా.. 'వినయ విధేయ రామ' ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఈ భామ తెలుగు తెరపై అంతగా కనిపించనప్పటికీ సామాజిక మాధ్యమాల ద్వారా ఇక్కడి యువతరానికి చేరువగానే ఉంటోంది. హాట్ హాట్ ఫొటో షూట్లతో సోషల్‌వాల్‌ను హీటెక్కిస్తోంది. అయితే ఈ హాట్‌నెస్ ఆమె ఫొటోలకే పరిమతం కాదండోయ్.. మాటల్లోనూ దర్శనమిస్తోంది.
తాజాగా డేటింగ్ విషయమై తన మనసులో మాటలు పంచుకున్న ఈ అమ్మడు.. డేటింగ్ తప్పేకాదంటూ దిమ్మ తిరిగిపోయే సమాధానమిచ్చింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఈ మాట చెప్పడం వెనుక ఓ లాజిక్కు ఉందట. పెళ్లికి ముందే కలిసి తిరగడం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు మంచి సమయం దొరుకుతుందని, ఈ ప్రయాణంలో ఒకరినొకరు విడిచి ఉండలేము అన్న అభిప్రాయం కలిగితే తర్వాత హ్యాపీగా పెళ్లి చేసేసుకోవచ్చని చెప్తోంది.
ప్రేమ.. డేటింగ్‌ల గురించి ఇంత చక్కటి పాఠాలు చెప్తోన్న ఈ అమ్మడు మాత్రం ఇప్పటికీ తన స్టేటస్ సింగిల్ అనే అంటోంది. ప్రస్తుతానికి తన దృష్టంతా సినీ కెరీర్‌పైనే ఉందని, ఎవరితోనూ రిలేషన్‌లో ఉండే తీరిక అసలు లేదని క్లారిటీ ఇచ్చింది.
ఇదీ చదవండి: లవర్స్ డే: టాలీవుడ్లో ప్రేమికుల సినిమా సందడి