ETV Bharat / sitara

తొలి సినిమాలోనే హీరోయిన్​తో ప్రేమలో పడిన యశ్​​ - కేజీఎఫ్​ హీరో యశ్​

'కేజీఎఫ్'​ ఫేం యశ్​ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తాజాగా 12 ఏళ్లు పూర్తిచేసుకున్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. "ఈ ప్రత్యేకమైన రోజును ఎప్పటికీ మర్చిపోలేను" అన్నాడు. అతడి సినీ ప్రయాణంపై ఓ లుక్కేద్దాం.

yash
యుశ్​
author img

By

Published : Jul 19, 2020, 11:13 AM IST

హీరో యశ్‌ అంటే గుర్తుపట్టకపోవచ్చేమో కానీ 'కేజీఎఫ్‌' రాఖీభాయ్‌ అని చెబితే టక్కున గుర్తొస్తాడు. ఆ పాత్రకు తను తప్ప మరెవరూ న్యాయం చేయలేరన్న రీతిలో నటించాడు. కన్నడలో స్టార్‌ హీరోగా వెలుగొందుతున్న యశ్‌.. కేజీఎఫ్‌ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలన విజయం అందుకున్నాడు. ఒక్క సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా మారిన ఇతడు.. సినీ పరిశ్రమలో అడుగుపెట్టి.. జులై 18 నాటికి 12 ఏళ్లు పూర్తిచేసుకున్నాడు

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తొలి సినిమాతోనే ప్రేమలో

యశ్ అసలు పేరు నవీన్‌ కుమార్‌ గౌడ. తను నటించిన తొలి చిత్రం 'మొగ్గిన మనసు'. అది 2008 జులై 18న విడుదలైంది. రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా రాధికా పండిట్‌ నటించింది. విశేషమేమిటంటే, రాధికా పండిట్‌.. యశ్‌ సతీమణి. ఈ చిత్రంతోనే వీరిద్దరు వెండితెరకు పరిచమయ్యారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో యశ్‌.. రాధికా ప్రేమించుకొని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.

ఈ చిత్రానికి శశాంక్‌ దర్శకత్వం వహించారు. ఇది మంచి విజయాన్ని అందుకోవడం వల్ల హీరోగా యశ్‌కు అవకాశాలు వరుస కట్టాయి. దీంతో 'కల్లారా సంతే', 'మొదలసాల', 'రాజధాని', 'కిరాతక', 'గూగ్లీ', 'రాజహులి' వంటి సినిమాల్లో నటించాడు. 2014లో వచ్చిన 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ రామాచారి' బ్లాక్‌బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. దీనిలోనూ రాధికా పండిట్‌ హీరోయిన్‌.

ఆ తర్వాత 'కేజీఎఫ్‌ చాప్టర్‌-1'తో యశ్‌ ఆల్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. ప్రస్తుతం కేజీఎఫ్‌ చాప్టర్‌-2లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని సినీ అభిమానులు ఎదురుచూస్తున్నాడు. కానీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది.

సినీ హీరోగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యశ్‌ మాట్లాడుతూ.. ఈ ప్రత్యేకమైన రోజును ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు. ఏమీ లేని స్థాయి నుంచి తారస్థాయికి వచ్చానని చెప్పాడు. 'కేజీఎఫ్‌ చాప్టర్‌-2' గురించి ప్రస్తావిస్తూ.. ఈ సినిమా షూటింగ్‌ కొంత మిగిలిపోయిందని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తానని ‌ చెప్పాడు.

yash
యశ్​

ఇది చూడండి : ప్రభాస్​-నాగ్​ అశ్విన్​ సినిమా కొత్త కబురు నేడే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.