ETV Bharat / sitara

'చిత్రీకరణ పూర్తయింది.. మిగిలింది డబ్బింగ్​ మాత్రమే' - కేజీఎఫ్​ ఛాప్టర్​2 న్యూస్​

'కేజీఎఫ్​: ఛాప్టర్​2'లో బాలీవుడ్​ నటుడు సంజయ్​ దత్​ నటించాల్సిన సన్నివేశాలు దాదాపుగా పూర్తయ్యాయని తెలిపింది చిత్రబృందం. అనారోగ్యం కారణంగా సినిమాలకు తాత్కాలిక విరామం ప్రకటించారు సంజయ్​. ఈ క్రమంలో చిత్రీకరణకు సంబంధించిన విషయాలపై ఓ ఇంటర్య్వూలో అడిగిన ప్రశ్నకు స్పష్టతనిచ్చింది చిత్ర యూనిట్​.

KGF Chapter 2: Shooting of Sanjay Dutt's portions in the Yash starrer is almost finished; Only dubbing left
'చిత్రీకరణ పూర్తయింది.. మిగిలింది డబ్బింగ్​ మాత్రమే!'
author img

By

Published : Aug 14, 2020, 5:30 AM IST

అనారోగ్యం కారణంగా మెరుగైన వైద్యం కోసం సినిమాలకు తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు బాలీవుడ్​ నటుడు సంజయ్​ దత్​. దీనిపై స్పందించిన పలువురు సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆశించారు. ఈ క్రమంలో 'కేజీఎఫ్​: ఛాప్టర్​2'లో ఆయన నటించాల్సిన సన్నివేశాలు దాదాపుగా పూర్తయ్యాయని నిర్మాణ సంస్థ ఓ ఇంటర్వ్యూలో ప్రకటించింది.

"సంజయ్​ దత్​ త్వరగా కోలుకొని తిరిగి రావాలని కోరుకుంటున్నాం. కేజీఎఫ్​ చిత్రంలో ఆయనకు సంబంధించిన సన్నివేశాలు దాదాపుగా పూర్తి చేశాం. ఆయన కోలుకున్న తర్వాత మిగిలిన ఒకటి లేదా రెండు సన్నివేశాలను చిత్రీకరించడం సహా పాత్రకు సంబంధించిన డబ్బింగ్​ను పూర్తి చేస్తాం" అని 'కేజీఎఫ్​' చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది.

సంజయ్​ పుట్టినరోజు సందర్భంగా 'కేజీఎఫ్​: ఛాప్టర్​2' చిత్రంలోని ప్రతినాయకుడు అధీరా లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.​ ప్రస్తుతం 'షంషేర్​', 'భుజ్​: ది ప్రైడ్​ ఆఫ్​ ఇండియా', 'కేజీఎఫ్​: చాప్టర్​2', 'పృథ్వీరాజ్​' చిత్రాల్లో నటిస్తున్నారు సంజయ్​ దత్. ఆయన నటించిన 'సడక్​ 2' చిత్రం ఈ నెలాఖరున ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.